చిరంజీవి గారు ఆ డైలాగ్ వద్దన్నారు.. రిక్వస్ట్ చేసి మరీ పెట్టించా, పూరికి తొక్కలో సలహా ఇచ్చా: సత్యదేవ్

Published : Oct 09, 2022, 09:47 AM IST

శనివారం జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అందరి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సత్యదేవ్ అదరగొట్టేశాడు. స్టైలిష్ విలన్ గా సత్యదేవ్ నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. 

PREV
16
చిరంజీవి గారు ఆ డైలాగ్ వద్దన్నారు.. రిక్వస్ట్ చేసి మరీ పెట్టించా, పూరికి తొక్కలో సలహా ఇచ్చా: సత్యదేవ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలు కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రతి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

 

26

శనివారం జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అందరి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సత్యదేవ్ అదరగొట్టేశాడు. స్టైలిష్ విలన్ గా సత్యదేవ్ నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. సక్సెస్ సెలబ్రేషన్ లో సత్యదేవ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 5 సినిమా రిలీజ్ అయ్యాక నాకు యూఎస్ నుంచి కాల్స్ మొదలయ్యాయి. ఒక్కొక్కరు సినిమా గురించి అద్భుతంగా చెబుతుంటే కుదురుగా కూర్చోలేకపోయాను. 

36

వింత వింతగా ప్రవర్తించాను. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఇంతేనేమో అని అనిపించింది. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన చెప్పాలి. అన్నయ్య చిరంజీవి గారితో ఫస్ట్ మీటింగ్ జరిగే సన్నివేశం షూట్ చేస్తున్నాం. 

46

ఆ సీన్ అన్నయ్య నన్ను నిన్ను కాపాడడానికి ఎవడు ఉన్నాడ్రా అని అనాలి. కానీ నిన్ను కాపాడడానికి ఎవడు ఉన్నాడ్రా బచ్చా అని అంటే ఎలా ఉంటుంది అనే డిస్కషన్స్ జరుగుతోంది. చిరంజీవి గారు అలా వద్దులే సత్య అని అన్నారు. అది చిరంజీవిగారి ఫేమస్ వర్డ్.. అన్నయ్య ప్లీజ్ నను బచ్చా అని అనండి అని రిక్వస్ట్ చేసి మరీ ఆ డైలాగ్ పెట్టించినట్లు సత్య దేవ్ తెలిపారు. 

56

శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లు అన్నయ్యతో నంటించిన తర్వాత తన కెరీర్ కి ఒక అర్థం వచ్చింది అని సత్యదేవ్ అన్నారు. పూరి జగన్నాధ్ గారు ఫోన్ చేసి రేపు అన్నయ్యతో నాకు షూటింగ్ ఉంది.. టెన్షన్ గా ఉంది.. డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పు ... నువ్వు ఆల్రెడీ షూటింగ్ చేసావు కదా అన్నారు. 

66

అదేం సమస్య కాదు.. ఆయన కళ్ళలోకి చూడకుండా చెప్పేయండి అయిపోతుంది అని చెప్పా. ఆరోజు సాయంత్రం ఫోన్ చేసి.. తొక్కలో సలహా ఇచ్చావ్, వర్కౌట్ కాలేదు.. నీకు సైట్ ఉంది నాకు లేదు అని అన్నయ్య అన్నారు అని పూరి చెప్పారు. ఈ సరదా సంభాషణతో అక్కడ అంతా నవ్వులు విరిశాయి. 

click me!

Recommended Stories