ఐసీయూలో భారతీరాజా.. స్టార్ డైరెక్టర్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే? ఆసుపత్రి నుంచి కీలక ప్రకటన

Published : Jan 04, 2026, 12:34 PM IST

Bharathiraja Health Status: సౌత్ స్టార్ డైరెక్టర్ భారతీరాజా తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరారాు. రీసెంట్ఇ గా తన కొడుకును కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న ఆయన.. ఇప్పుడు మళ్లీ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

PREV
15
భారతీరాజా హెల్త్ అప్‌డేట్

సినిమాలో గ్రామీణతను, సహజమైన హ్యూమన్ ఎమోషన్స్ ను  కొత్తగా పరిచయం చేసిన దర్శకులలో  భారతీరాజా ఒకరు. 16 ఏళ్ల వయసు తెలుగు సినిమాను తమిళంలో 16 వయదినిలే' సినిమాగా తెలరకెక్కించి… దర్శకుడిగా అరంగేట్రం చేశాడు భారతీ రాజా.  తొలి సినిమాలోనే రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి లాంటి స్టార్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

25
తమిళ సినిమా గతిని మార్చిన దర్శకుడు

ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు అందించి తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. 'కిళక్కే పోగుం రైల్', 'అలైగళ్ ఓయవదిల్లై', 'ముదల్ మరియాదై' లాంటి సినిమాలతో తమిళ సినిమా గతిని మార్చారు. రాధిక, రాధ, కార్తీక్ లాంటి ఎందరో నటీనటులను పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే.

35
నటుడిగా సత్తా చాటిన భారతీరాజా

దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా మారి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఇటీవల 'తిరు సినిమాలో ధనుష్‌కు తాతగా నటించి మెప్పించారు. వయసును మించిన ఆయన నటన అనుభవాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. 

45
కుమారుడి మరణంతో తీవ్ర ఆవేదన

ఈ క్రమంలో, భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గత మార్చిలో ఆకస్మికంగా మరణించడం ఆయన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మలేషియాలోని కూతురి ఇంట్లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుని, తర్వాత చెన్నైకి తిరిగి వచ్చారు.

55
ఐసీయూలో భారతీరాజా..

ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన భారతీరాజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అనవసరమైన వదంతులు నమ్మవద్దని అభిమానులను కోరింది.

Read more Photos on
click me!

Recommended Stories