దీపికా పదుకొణె టాప్ 5 వివాదాలు, స్టార్ హీరోయిన్ ను చిక్కుల్లో నెట్టిన కాంట్రవర్సీలు ఇవే..

Published : Jan 04, 2026, 12:04 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో  దీపికా పదుకొణె ఒకరు.  జనవరి 5న  40 వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది స్టార్ బ్యూటీ. ఆమె కెరీర్ లో అద్భుతమైన సినిమాలతో పాటు.. ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. దీపికా ఫేస్ చేసిన టాప్ 5 కాంట్రవర్సీల గురించి మీకు తెలుసా?   

PREV
16
8 గంటల షిఫ్ట్ వివాదం..

దీపికా పదుకొణే  తల్లయ్యాక తన కూతురికి సమయం కేటాయించాలనుకుంది. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ సరసన నటించే క్రమంలో..  ఆమె 8 గంటల షిఫ్ట్ ను డిమాండ్ చేసింది. దానికి మూవీ టీమ్ ఒప్పుకోకపోవడంతో.. ఆ సినిమా నుంచి ఆమె  తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేసింది దీపిక. 

26
హీరోలతో సమానంగా ఉండాలని..

హీరోలతో సమానంగా పని గంటలు ఉండాలని దీపిక చేసిన డిమాండ్‌తో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ఇన్నిగంటలే పనిచేస్తాం అని అంటే ఎలా అని మేకర్స్ మండిపడుతున్నాు. హీరోయిన్లు ఇలా  పనివేళలు కూడా నిర్ణయిస్తే సినిమాలు తీయడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

36
పద్మావత్ సినిమా వివాదం..

గతంలో 'పద్మావత్' సినిమాలో నటించింది దీపిక.. రాణి పద్మావతిగా దీపిక అద్భుతం చేసింది. అయితే ఈసినిమా టైమ్ లో దీపిక పాత్రపై వివాదం రేగింది. రణవీర్‌తో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయనే పుకార్లతో దుమారం రేగింది. అయితే, తీవ్ర వ్యతిరేకతతో ఆ సీన్‌ను తొలగించారని అంటారు. ఇందులో నిజం ఎంతో మాత్రం తెలియాల్సి ఉంది.

46
దీపిక బికినీ దుమారం..

షారుక్ ఖాన్ హీరోగా నటించిన  'పఠాన్'లోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపిక కాషాయ రంగు బికినీ ధరించడం వివాదాస్పదమైంది. హిందూ సంఘాలు ఈ విషయంలో.. తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పవిత్రంగా చూసుకునే  రంగును ఇలా ప్రదర్శించడం మనోభావాలను దెబ్బతీయడమేనని వాదించాయి.

56
మాదకద్రవ్యాల కేసులో..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మాదకద్రవ్యాల కేసు విచారణలో దీపిక పేరు బయటకొచ్చింది. ఆమె మాదకద్రవ్యాలు తీసుకుంటుందని ఆరోపణలు వచ్చాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆమెను విచారణకు పిలిచింది. కానీ ఈ విషయంలో ఎటువంటి ఫలితం బయటకు రాలేదు.

66
విద్యార్థుల నిరసనలో దీపిక

'ఛపాక్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఢిల్లీలోని JNUలో విద్యార్థుల నిరసనలో దీపిక పాల్గొంది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో దుమారం రేగడంతో, ఆమె సినిమా ఫ్లాప్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories