రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం హిందీ హిట్ 'రెయిడ్' సినిమాను స్ఫూర్తిగా తీసుకుని, ఆ కథకు తనదైన మార్పులు - చేర్పులతో హరీష్ శంకర్ తెరకెక్కించారు. కలెక్షన్స్ రెండో రోజు నుంచే దారుణంగా పడిపోయి చివరకు డిజాస్టర్ గా నమోదైంది.
తొలిరోజు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వరకు వసూళ్లను రాబట్టిన మిస్టర్ బచ్చన్ మూవీ నిర్మాతకు కలిగించిన ఆనందం ఎంతో సేపు నిలపలేదు. . రవితేజ కెరీర్‌లో మరో డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు తేల్చేసాయి.