బెంగుళూరు పార్టీకి వెళ్ళాను, నేను సాంప్రదాయని కాదు, నా లైఫ్ నా ఇష్టం... సంచలనంగా నటి హేమ కామెంట్స్ 

First Published | Aug 20, 2024, 9:00 AM IST

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ పార్టీకి హాజరైనట్లు హేమ ఒప్పుకున్నారు. ఎక్కడికైనా వెళతాను, నా లైఫ్ నా ఇష్టం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 
 


నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారన్న వార్త సంచలనం రేపింది. ఓ ప్రముఖుడు బెంగళూరు శివారులో గల ఫార్మ్ హౌస్ లో తన బర్త్ డే పార్టీ నిర్వహించాడు. దాదాపు వంద మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం పై పోలీసులు దాడి చేశారు. 80 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. 

పోలీసులు ఆమె ఫోటో విడుదల చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. వరుస కథనాల నేపథ్యంలో హేమ వీడియో విడుదల చేసింది. నేను హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్లో చిల్ అవుతున్నాను. బెంగుళూరులో జరిగిన పార్టీలో నేను పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. హేమ అబద్దం చెప్పారని రుజువైంది.  బెంగుళూరు పోలీసులు విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు జారీ చేశారు. 


ఈ ఏడాది మే 19-20 తారీఖుల్లో ఈ పార్టీ నిర్వహించారు. పార్టీలో నిషేదిత MDMA పిల్స్, కొకైన్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. విచారణకు హాజరైన హేమకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు పాజిటివ్ అని తేల్చారు. జైలుకు వెళ్లిన హేమ అనంతరం కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారు.

Actress Hema

తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ... తాను బెంగుళూరు పార్టీకి హాజరైనట్లు ఒప్పుకుంది. అయితే అది రేవ్ పార్టీ కాదని ఆమె అంటున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటని హేమ యాంకర్ ని తిరిగి ప్రశ్న అడిగారు. డ్రగ్స్ తీసుకుంటారట, బట్టలు లేకుండా ట్రాన్స్ లో ఉంటారట... అని యాంకర్ సమాధానం చెప్పాడు. నీ అక్క(హేమ) అలా చేస్తుందని నువ్వు నమ్ముతావా? అని హేమ తిరిగి ప్రశ్నించింది. లేదని యాంకర్ అన్నారు. 
 

Photo courtesy: Suman Tv

Actress Hema


నేను శనివారం జరిగిన పార్టీలో ఉన్నాను. ఆదివారం ఏం జరిగింది అనేది నాకు తెలియదు. బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి నా బ్రదర్ లాంటివాడు. అతడు పిలిస్తే వెళ్ళాను. నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. పాజిటివ్ వచ్చిందని ఓ మీడియా ఛానల్ ప్రచారం చేసింది. తిరిగి వాళ్ళను నేను ప్రశ్నిస్తే... హేమ హైడ్రామా చేస్తుందని కథనాలు ప్రసారం చేశారు. 


Photo courtesy: Suman Tv

Actress Hema

సాంప్రదాయని అంటూ ఎగతాళి చేశారు. నేను సాంప్రదాయని కాదు. నేను ఎక్కడికైనా వెళతాను. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టే చెబుతుంది. కానీ కోర్టు వ్యవహారాలు వెంటనే తేలేవి కాదు. దానికి కొంత సమయం పడుతుంది.. అంటూ హేమ చెప్పుకొచ్చారు. మా సభ్యత్వం రద్దు చేయడంపై కూడా హేమ అసహనం వ్యక్తం చేసింది. 

Photo courtesy: Suman Tv

Latest Videos

click me!