అమీర్‌ ఖాన్‌తో సినిమా.. కండీషన్స్ పెట్టిన చిరంజీవి.. రీమేక్‌ చేయడంపై షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

Published : Aug 01, 2022, 05:04 PM ISTUpdated : Aug 01, 2022, 05:06 PM IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌పెక్ట్ అమీర్‌ ఖాన్‌, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. తాజాగా వీరిద్దరు కలిసి సినిమా చేయాలనుకుంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో చిరు కండీషన్స్ పెట్టడం విశేషం.   

PREV
16
అమీర్‌ ఖాన్‌తో సినిమా.. కండీషన్స్ పెట్టిన చిరంజీవి.. రీమేక్‌ చేయడంపై షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

అమీర్‌ ఖాన్‌ నాగచైతన్య కలిసి నటించిన `లాల్‌ సింగ్ చడ్డా` సినిమా ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్‌లోనూ పాల్గొంటున్నారు చిరంజీవి. చిరంజీవి, అమీర్‌ ఖాన్‌, నాగచైతన్యలతో నాగార్జున చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 
 

26

అందులో భాగంగా అమీర్‌ ఖాన్‌.. చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయాలనే ఆసక్తిని వెల్లడించారు. దర్శకత్వం గానీ, నిర్మాతగా గానీ అని వెల్లడించారు. దీనికి చిరంజీవి విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్ కి కండీషన్స్ పెట్టారు. `అన్నీ ఫస్ట్ టేక్‌లోనే ఓకే చేస్తాను అంటేనే` తాను సినిమా చేస్తానని తెలిపారు చిరంజీవి. అమీర్‌ఖాన్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అనే విషయం తెలిసిందే. ఆయన ఓ పట్టాన సీన్‌ ఓకే చేయరనేది చిరు ఉద్దేశ్యం. ఆ విషయాన్ని ఇలా సెటైరికల్‌గా చెప్పారు చిరంజీవి. 

36

దీనికి కొనసాగింపుగా నాగార్జున చెబుతూ, దర్శకత్వం వద్దు, మీరు నిర్మాతగా ఉంటేనే బెటరేమో..` అని సర్ది చెప్పాడు. అమీర్‌ఖాన్‌తో చిరంజీవి నిజంగానే సినిమా చేస్తే అది ఇండియన్‌ బిగ్గెస్ట్ మూవీలో ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి ఊగిపోవడం ఖాయం అంటున్నారు. అయితే ఇలాంటి ప్రమోషన్ల టైమ్‌లో సరదాగా కాంబినేషన్లని ప్రకటిస్తుంటారని, అవి కార్యరూపం దాల్చేవరకు నిజమని చెప్పలేం. కానీ అమీర్‌ ఖాన్ చెప్పాడంటే అందులో ఎంతో కొంత సీరియస్‌నెస్‌ ఉంటుందని చెప్పొచ్చు. 

46

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అమీర్‌ ఖాన్‌ నటించిన చిత్రాల్లో ఏ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తారు? అని చిరంజీవిని నాగ్‌ని ప్రశ్నించగా, తాను రీమేక్‌ చేయనని స్పష్టం చేశారు. అమీర్‌ ఖాన్‌ సినిమాలను చూడటమే కానీ, చేయడం కుదరదు` అని తెలిపారు.

56

ఇదిలా ఉంటే చిరంజీవి.. అమీర్‌ ఖాన్ సినిమా ప్రమోట్‌ చేయడం వెనకాల బలమైన కారణమే ఉందని తెలుస్తుంది. `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ని గెస్ట్ రోల్‌లో నటింప చేస్తున్నారు. దీంతో `గాడ్‌ ఫాదర్‌`ని హిందీలో ప్రమోట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికితోడు రామ్‌చరణ్‌ నటించే చిత్రాలను బాలీవుడ్‌లో ప్రమోట్‌ చేసేందుకు, సపోర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది. 

66

దీనికితోడు అమీర్‌ ఖాన్‌కి కూడా ఇక్కడ సహకారం అందిస్తే, హిందీలో ఆయన మార్కెట్‌ తనకు, రామ్‌చరణ్‌కి ఉపయోగపడుతుందని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా భారీ ప్లానింగ్‌తోనే చిరంజీవి ముందుకు సాగుతున్నారని తెలుస్తుంది. చిరంజీవి ఇప్పుడు తెలుగులో `గాడ్‌ ఫాదర్‌`లో నటిస్తున్నారు. ఇది దసరాకి విడుదల కానున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు `భోళా శంకర్‌`, `వాల్తేర్‌ వీరయ్య` చిత్రాల్లో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories