విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ మూవీ కూడా దిల్‌ రాజుతోనే.. దర్శకుడు ఎవరితోనే తెలిస్తే ఆశ్చర్యం..

Published : Apr 27, 2024, 12:04 PM IST

గ్యారెంటీగా సూపర్ హిట్ కొట్టాలని అందుకు తగ్గట్లుగా కథలను విజయ్ దగ్గరకు పంపుతున్నారట. ఈ క్రమంలో రెండు కథలను ఓకే చేసి ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారుట.  

PREV
16
విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ మూవీ కూడా దిల్‌ రాజుతోనే.. దర్శకుడు ఎవరితోనే తెలిస్తే ఆశ్చర్యం..

 బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో దుమ్ము దులుపుతుంది అని హై ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన చిత్రం ఫ్యామిలీ స్టార్. సమ్మర్ లో రిలీజ్ పెట్టుకున్న  టాప్ స్టార్ మూవీస్ ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ అవ్వటంతో వాటి ప్లేస్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్.  విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star) మూవీ పెద్ద సినిమా ప్లేస్ లో వచ్చి రిజల్ట్ తిరగబడింది.

26

 మరో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ లోడింగ్ అంటూ అంచనాలు వినిపించాయి.   భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అవ్వగా సమ్మర్ అడ్వాంటేజ్, ఉగాది హాలిడే అలాగే రంజాన్ హాలిడేలు కూడా ఉన్నప్పటికీ ఈ సినిమా వాటి అడ్వాంటేజ్ ను ఏమాత్రం వాడుకోలేక పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ భారీ ఎత్తున తరలి వస్తారు అని టీం ఎంత ప్లాన్ చేసినా  కూడా… సినిమాకి వచ్చిన  డివైడ్ టాక్ ఏ దశలో కూడా ఎక్సపెక్టేషన్స్ ను అందుకోలేక పోయింది. దాంతో బడ్జెట్ పరంగా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్,డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

36
Actor Vijay Devarakonda

 ఈ సినిమాను కొన్ని చోట్ల సొంత  రిలీజ్ చేసినా కూడా కొన్ని చోట్ల భారీ రేట్లకే అమ్మగా కొన్ని ప్రతీ ఏరియలో కూడా సినిమాకి భారీ నష్టాలు రావడంతో సినిమాను కొన్న వాళ్ళు అందరూ కూడా దిల్ రాజుని కలిసి రికవరీ అడగటం, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి సిద్ధం అయ్యారు దిల్ రాజు.అయితే అదే సమయంలో విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయటానికి దిల్ రాజు సిద్దమయ్యారని సమాచారం.  

46
Vijay Devarakonda

విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఇలా భారీ నష్టాలతో అందరినీ కూడా తీవ్రంగా నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకుని షాకిచ్చినా మరో సినిమా చేయటానికి సిద్దమయ్యారట. గ్యారెంటీగా సూపర్ హిట్ కొట్టాలని అందుకు తగ్గట్లుగా కథలను విజయ్ దగ్గరకు పంపుతున్నారట. ఈ క్రమంలో రెండు కథలను ఓకే చేసి ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారుట.

56

అందులో ఓ కథ.. రాజావారు రాణీవారు దర్శకుడు రవి కిరణ్ కోల అని తెలుస్తోంది. ఓ ఇంట్రస్టింగ్ స్ట్రిప్టుని విజయ్ దేవరకొండ కోసం రాసుకుని దిల్ రాజు చుట్టూ తిరుగుతున్నారట. ఆ చిత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్ అని, కంప్లీట్ గా ఓ డిఫరెంట్ ప్లాట్ అని ఇప్పటిదాకా విజయ్ అలాంటి స్క్రిప్టు చేయలేదని అంటున్నారు. ఆ కథ కనుక ఓకే చేస్తే ఓ కథ కథను చేసినట్లు ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నారట. 

66
Vijay Devarakonda

అదే సమయంలో ఓ పెద్ద దర్శకుడు ..ఓ భారీ కథతో విజయ్ దేవరకొండ డేట్స్ కోసం దిల్ రాజు చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారట. దిల్ రాజు గతంలో ఆ దర్శకుడుతో సినిమా చేసి ఉన్నారట. ఆ కథ చేస్తే మాస్ సినిమా అవుతుంది కానీ తన ఇమేజ్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందనేది విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నారట. అలా ఈ రెండు ప్రాజెక్టులలో ఒకటి చేయాలని చూస్తున్నారట. అదీ సంగతి.
 

Read more Photos on
click me!

Recommended Stories