రామ్ చరణ్ NO చెప్పిన 5 సినిమాలు.. వాటి బాక్సాఫీసు రిజల్ట్ లు

First Published Apr 27, 2024, 11:27 AM IST

చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 17 ఏళ్లు గడిచాయి.  ఈ 17ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి.

ఇండస్ట్రీలో చిరంజీవికి మంచి జడ్జిమెంట్ ఉందని చెప్తారు.  ఆయన కథ విని వర్కవుట్ అవుతుందంటే మాగ్జిమం ఆడుతుంది. ఆయన నో చెప్పిన కథలు దాదాపుగా ఆడలేదని చెప్తారు. అయితే బయిటకు వెళ్లిన ఆ కథలు చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేసి హిట్ కొట్టిన ధాకలాలు ఉన్నాయి. అదే పద్దతి రామ్ చరణ్ కు వచ్చిందని చెప్పుకుంటారు. సాధారణంగా చిరంజీవి లేదా రామ్ చరణ్ లేదా ఏ పెద్ద హీరో దగ్గరకైనా కథ వెళ్లాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది. 
 

ఓ మాదరి రైటర్స్ అయితే చాలా మందికి ఆ కథ చెప్తారు. అక్కడే ఫిల్టరైపోతుంది. అన్ని దాటుకుని రామ్ చరణ్ దాకా వెళ్లాలంటే అందులో ఎంతో కొంత విషయం ఉంటుంది. అయితే ఆ విషయం తమకు పనికివస్తుందా లేదా అనేది వాళ్లు చూసుకుంటారు. అలా   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రిజక్ట్ చేసిన ఐదు సినిమాలు ..వాటి రిజల్ట్ లు చూద్దాం. అయితే ఇవి మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

దర్శకుడు గౌతమ్...సూర్య సన్నాఫ్ కృష్ణన్ కధను ముందు రామ్ చరణ్ కు విన్పించారు. అయితే చిరుత విడుదలై అప్పటికి ఏడాదే కావడంతో  డ్యూయర్ రోల్ లో అదీ తండ్రి పాత్రలో కనిపించే పాత్ర  సినిమా వద్దనుకున్నాడు. నో చెప్పారు. ఆ తర్వాత సూర్య హీరోగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాటలు సూపర్ హిట్. తెలుగులో మాత్రం ఆడలేదు. 
 

తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన  ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ (Surya Son of Krishnan)  ఆయన అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. తండ్రిగా, కొడుకుగా సూర్య పెర్ఫామెన్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ను కదిలిస్తుంది. మత్తుకు అలవాటైన కొడుకును మార్చే తండ్రి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2008లో ఈ చిత్రం విడుదలైంది. సిమ్రాన్, సమీరా రెడ్డి హీరోయిన్లు. గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకుడు.

 మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఓకే బంగారం కథ మొదట రామ్ చరణ్ విన్నారు. కొద్ది రోజులు డిస్కషన్స్ జరిగాయి. అయితే అంత సున్నితంగా ఉన్న కథ తెలుగులో వర్కవుట్ కాదని చెప్పి  రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు. నిజంగానే ఆ తర్వాత డబ్ చేసి తెలుగులో వదిలినా ఆ  సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యామీనన్, దుల్కర్ కలిసి నటించినా, సూపర్  హిట్స్ పాటలు ఉన్నా బిలో యావరేజ్ అయ్యింది. 

కృష్ణార్జున యుద్ధం

ఇక నాని హీరో గా వచ్చి డిజాస్టర్ అయిన  కృష్ణార్జున యుద్ధం కథ కూడా మొదట రామ్ చరణ్ కే వెళ్లిందట. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వరుస విజయాల్ని అందించిన మేర్లపాక గాంధీ..కృష్ణార్జున యుద్ధం కధ  ఫెరఫెక్ట్ గా  రామ్ చరణ్ సెట్ అవుతుందనుకున్నారట. అయితే ద్విపాత్రాభినయం బాగున్నా కధలో కొత్తదనం లేదని నిరాకరించాడు చెర్రీ. తరువాత ఇదే సినిమా నానీ హీరోగా విడుదలైంది. సినిమా వర్కవుట్ కాలేదు.

ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ చేసిన నేల టికెట్ కథ రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళగా ఆ కథ కూడా తనకి సెట్ కాదని నో చెప్పాడట.సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాలతో  ఉన్న దర్శకుడు అయినా కథలో మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవటం లేదని, నేల టిక్కెట్టు వర్కవుట్ కాదని  రామ్ చరణ్  చెప్పారట. అయితే కొద్దిపాటి మార్పులతో మళ్లీ కలిసినా గ్రీన్ సిగ్నల్ రాలేదట. దాంతో  దర్శకుడు కృష్ణ కురసాల  అనంతరం ఈ సినిమా రవితేజ హీరోగా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.  

25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.;

 గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏటో వెళ్ళిపోయింది మనసు కథ మొదట రామ్ చరణ్ దగ్గరకే వచ్చిందిట. అయితే తన మాస్ ఇమేజ్ కు ఈ కథ వర్కవుట్ అవదని సున్నితంగా చెప్పారట. అప్పుడు నాగార్జున కు చెప్పటం, నాని, సమంత కాంబినేషన్ లో చేయటం, బ్లాక్ బస్టర్ హిట్ అవటం జరిగింది. అయితే రామ్ చరణ్ తో చేస్తే ఆ స్దాయిలో హిట్ అయ్యేదా అంటారా..

#RC16

బుచ్చితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

game changer

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ  గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గానూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత కీలకపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

click me!