మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాంచరణ్ నుంచి వస్తున్న చిత్రం ఇది. దీనితో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ చిత్రానికి తిరుగు ఉండకపోవచ్చు. కానీ నార్త్ లో అంత బలంగా ప్రమోషన్స్ చేయలేదు. మరి వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
రాంచరణ్ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో రాంచరణ్ అనేక విషయాలని మనసు విప్పి పంచుకున్నారు. పెళ్లైన పదేళ్లకు పుట్టిన తన ముద్దుల కూతురు క్లింకార గురించి చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. క్లింకార తనని ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడే ప్రపంచానికి పరిచయం చేస్తానని చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు.
క్లింకార ముఖాన్ని చూపించకపోవడానికి బలమైన కారణం ఉందట. రాంచరణ్ మాట్లాడుతూ.. నేను నా బాల్యంలో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. స్కూల్ లో మాత్రమే కాదు ఎక్కడికి వెళ్లినా అందరూ గుర్తుపట్టేవారు. దీనితో ప్రైవసీ ఉండేది కాదు. ప్రైవసీ లేకపోవడం భారంగా అనిపించేది. నా కూతురికి ఆ భారం ఉండకూడదు. నేను నా కూతురికి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ప్రైవసీ అని రాంచరణ్ తెలిపారు.
ప్రస్తుతం క్లింకార అమ్మ అని పిలవడం ప్రారంభించింది అని చరణ్ తెలిపారు. రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య డాకు మహారాజ్ చిత్రం, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.