ప్రభాస్ సినిమా ఫ్లాప్ కాబోతోంది.. డోంట్ వర్రీ, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా ?

Published : Mar 12, 2026, 06:04 PM IST

ప్రముఖ ప్రొడ్యూసర్ ప్రభాస్ ఫ్లాప్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎడిటింగ్ రూమ్ లోనే ఈ సినిమా ఫ్లాప్ అని తనకి అర్థం అయిపోయినట్లు ఆ ప్రొడ్యూసర్ తెలిపారు. ఇంతకీ అది ఏ సినిమానో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
ప్రభాస్ సినిమాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ప్రభాస్ అభిమానులకు పెద్ద నిరాశ తప్పలేదు. సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ తన కెరీర్ బిగినింగ్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ చిత్రాలు చేశారు. ప్రభాస్ కాలేజీ యువకుడిగా నటించిన సినిమా మున్నా.

25
దిల్ రాజు నిర్మాణంలో

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ టైంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. పోకిరితో సంచలన విజయం అందుకుని యువతకు కలలరాణిగా మారిన ఇలియానా హీరోయిన్. దీనితో మున్నా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

35
ఫ్లాప్ అని ముందే తెలుసు

దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది నాకు ఎడిటింగ్ రూమ్ లోనే తెలిసిపోతుంది. ఎడిటింగ్ రూమ్ లో సినిమాపై నాకు డౌట్ వచ్చింది అంటే ఆ మూవీ ఫ్లాప్. నేను 100 శాతం కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ మూవీ హిట్ అని దిల్ రాజు అన్నారు.

45
నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చా

మున్నా రిలీజ్ కి ముందురోజు రాత్రి ఇది ఫ్లాప్ అని అర్థం అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్లు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను కూడా డిస్ట్రిబ్యూటర్ గానే కెరీర్ ని ప్రారంభించా. మున్నా ఫ్లాప్ అని అర్థం కాగానే రిలీజ్ కి ముందు రోజు రాత్రి బయ్యర్లకు ఫోన్ చేశా. సినిమా ఫ్లాప్ కాబోతోంది. కానీ ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు.

55
దిల్ రాజు, ప్రభాస్ కాంబో

తనని నమ్ముకున్న బయ్యర్లకి వదులుకోవడం తనకి ఇష్టం లేదని దిల్ రాజు తెలిపారు. అనుకున్నట్లుగానే మున్నా చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత దిల్ రాజు ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సూపర్ హిట్ మూవీ నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories