ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి నుంచే తన వారసుడిని రెడీ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం అల్లు అయాన్ కు కఠిన శిక్షణలు కూడా స్టార్ట్ చేశాడు. ఇంతకీ అయాన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్నవయసులోనే అయాన్ కు అభిమానులు కూడా తయారయ్యారు. అయాన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా అతన్ని “మోడల్ అయాన్” అని కూడా పిలుచుకుంటారు. అయాన్ ఇప్పటికే స్టార్ అయిపోయాడు.. ఇక ముందు ముందు అల్లువారి వారసుడిగా తెరంగేట్రం చేయడం కూడా లాంచనమే అని తెలుస్తోంది.
24
అల్లు వీడియోలకు అభిమానులు ఎక్కువే..
అల్లు ఫ్యామిలీ అంతా.. తరచుగా అయాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి తమ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హకు సంబంధించిన అనేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే అల్లు శిరీష్ కూడా తరచుగా అయాన్ గురించి సరదాగా మాట్లాడుతూ అతనికి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు.ఈక్రమంలో అల్లు అయాన్ కు సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
34
అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్..
ఇటీవల స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో “ఫిబ్రవరి మెమరీస్” అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. వాటిలో ఒక వీడియో ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.వీడియోలో అయాన్ తన చేత్తో టైల్స్‌ను పగలగొట్టడం చూడవచ్చు. ఆ సమయంలో పక్కనే అతని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కూడా ఉండటం గమనించవచ్చు. దీని ద్వారా అయాన్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ వారసుడిగా అయాన్ ముందు ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే అయాన్ కు మార్షల్ ఆర్ట్స్ , డ్యాన్స్, లాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ముందు చూపుతో ఇప్పటి నుంచే తన వారసుడిని రెడీ చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. మరి అయాన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తాడా..? లేక డైరెక్ట్ గా హీరో ఎంట్రీ ఇస్తాడా చూడాలి?