సాటి హీరోలపై సెటైరికల్ డైలాగులు.. కృష్ణ, చిరంజీవి ఒప్పుకోరు.. ఎంత చెప్పినా డైరెక్టర్ వినలేదు

First Published Oct 4, 2024, 11:58 AM IST

టాలీవుడ్ లో కొందరు హీరోల మధ్య విభేదాలు ఉన్నాయని తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉండేవని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడైతే.. మెగా ఫ్యామిలి, నందమూరి ఫ్యామిలీ మధ్య ఆ రకమైన వార్తలు వస్తుంటాయి.

టాలీవుడ్ లో కొందరు హీరోల మధ్య విభేదాలు ఉన్నాయని తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉండేవని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడైతే.. మెగా ఫ్యామిలి, నందమూరి ఫ్యామిలీ మధ్య ఆ రకమైన వార్తలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా వార్స్ చేస్తుంటారు. కొన్ని చిత్రాల్లో సెటైరికల్ డైలాగులు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఇతర హీరోలపై సెటైర్లు వేస్తూ తమ చిత్రాల్లో డైలాగ్స్ పెడుతుంటారు. 

సాటి హీరోలపై సెటైర్లు వేయడాన్ని కొందరు హీరోలు ఒప్పుకునే వారు కాదు. అందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. ఎన్టీఆర్ తో పొలిటికల్ గా విభేదాలు వచ్చాక మాత్రం కృష్ణ ఆయనపై సెటైరికల్ మూవీస్ చేశారు. కానీ అంతకు ముందు సెటైరికల్ గా చిన్న డైలాగ్ ఉన్నా వద్దని చెప్పేవారట. ఎంఎస్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పరుచూరి బ్రదర్స్ ప్రమేయం లేకుండా ఎన్టీఆర్ పై సెటైర్ వేస్తూ డైలాగ్ పెట్టారు. ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్స్  స్వయంగా తెలిపారు. 

Latest Videos


డైలాగ్ గురించి మాకు తెలిసింది. ఇలాంటి డైలాగ్ పెట్టారేంటి.. మాకు చెడ్డ పేరు వస్తుంది.. అసలు అన్నగారిపై మేమెందుకు ఇలాంటి డైలాగ్ రాస్తాం అంటూ ఎంఎస్ రెడ్డి దగ్గరకి వెళ్లారట. ఎంఎస్ రెడ్డి నాకు తెలియదు.. కృష్ణని అడగండి అని చెప్పారు. కృష్ణని వెళ్లి అడిగితే.. ఆ డైలాగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు.. వెంటనే తీయించేస్తా అని చెప్పి సెకండ్స్ లో డైలాగ్ తొలగించారు. అది కృష్ణ గారు అంటే అంటూ పరుచూరి బ్రదర్స్ ప్రశంసలు కురిపించారు. 

అదే విధంగా రాంచరణ్ రచ్చ చిత్రంలో వివాదం చోటు చేసుకుంది. రచ్చ మూవీలో ఏదో చూసుకుని తొడలు కొట్టే టైపు కాదు నేను అనే డైలాగ్ ఉంది. ఈ చిత్రానికి కూడా పరుచూరి బ్రదర్స్ పని చేశారు. కానీ ఆ డైలాగ్ వాళ్ళు రాయలేదట. డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ అది. ఈ డైలాగ్ వినగానే ఆడియన్స్ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా ఉంది అనే క్లారిటీకి వచ్చేశారు. అది ఎవరిని ఉద్దేశించి అనేది  చెప్పనవసరం లేదు. అయితే చిరంజీవి చూసి ఇది వివాదం అవుతుంది.. వీలైతే తొలగించండి అని చెప్పారట. దీనితో డైరెక్టర్ సంపత్ నంది.. ఆ డైలాగ్ అక్కడ అవసరం అని చెప్పడంతో అందరూ కన్విన్స్ అయ్యారు. 

కానీ వివాదం అయితే జరిగిపోయింది. ఇటీవల చిత్రాల్లో పొలిటికల్ సెటైర్లు, కామెడీ పంచ్ లు ఎక్కువ అవుతున్నాయి. కొందరు పొలిటిషియన్ల మాటలని కామెడీ కోసం వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. 

click me!