ఆ విషయంలో అల్లు వారి కుటుంబంలో విబేధాలు... ఇంటి నుండి వెళ్లిపోయిన శిరీష్?

Published : Aug 18, 2022, 12:56 PM IST

అన్న, నాన్నలపై కోపంగా ఉన్న అల్లు శిరీష్ ఇంటి నుండి వెళ్లిపోయాడన్న వార్త కలకలం రేపుతోంది. ముంబైకి మకాం మార్చిన అల్లు శిరీష్ ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. 

PREV
17
ఆ విషయంలో అల్లు వారి కుటుంబంలో విబేధాలు... ఇంటి నుండి వెళ్లిపోయిన శిరీష్?
Allu Arjun


స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు కాగా... పెద్ద అబ్బాయి వెంకట్ నిర్మాతగా మారాడు. రెండో అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగారు. అందరికంటే చిన్నవాడు శిరీష్ సైతం అల్లు అర్జున్ బాటలో హీరోగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. 

27
Allu Arjun

ఎంత బ్యాకప్ ఉన్నా... టాలెంట్ తో పాటు కాలం కూడా కలిసి రావాలి. అల్లు శిరీష్ ఈ విషయంలో అన్న అల్లు అర్జున్ అంత అదృష్టవంతుడు కాదు. లుక్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్ యూనిక్ డాన్సింగ్ స్కిల్స్ తో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఆర్య మూవీతో మొదటి హిట్ అందుకున్న అల్లు అర్జున్ లేటెస్ట్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చుకున్నాడు. 
 

37
Allu Arjun

అల్లు అర్జున్ తో పోల్చితే శిరీష్ పరిస్థితి పూర్తిగా విరుద్ధం. 2013లో విడుదలైన గౌరవం మూవీతో శిరీష్ హీరో అయ్యాడు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతుంది. ఓ అరడజను చిత్రాలు చేసినా ఆయనకు బ్రేక్ రాలేదు. మెగా ఫ్యాన్స్ కి కూడా ఆయన దగ్గర కాలేకపోయాడు.

47
Allu Arjun


ఆయన చివరి చిత్రం ఏబీసీడీ 2019లో విడుదలైంది. ప్రేమ కాదంట టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అసలు ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుందా? లేదా అనే సమాచారం లేదు. చాలా కాలంగా చిత్ర యూనిట్ అప్డేట్స్ ఇవ్వడం లేదు. మరో ప్రక్క అన్న అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎక్కడికో వెళ్లిపోయారు. 

57
Allu Arjun

ఈ క్రమంలో అల్లు శిరీష్ తీవ్ర అసహనంలో ఉన్నారట. అన్న అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్ తన కెరీర్ గాలికి వదిలేశారని ఆవేదన చెందుతున్నాడట. అల్లు అర్జున్ కెరీర్ మాత్రం గొప్పగా నిర్మించిన అల్లు అరవింద్ తనను పట్టించుకోవడం లేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారట. అల్లు అర్జున్ భవిష్యత్ పై ఉన్న శ్రద్ధ తనపై లేదనేది అతడి ఆరోపణగా తెలుస్తుంది.

67
Allu Arjun


అదే సమయంలో పెద్ద స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తున్నాడట. అల్లు అర్జున్ తలచుకుంటే హీరోగా నిలబెట్టగలని భావిస్తున్న శిరీష్, ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధలో ఉన్నారట. కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు  దూరంగా ఉంటున్న శిరీష్ కొంత మానసిక వేదనకు గురి అవుతున్నట్లు సమాచారం. 

77
Allu Arjun


ఈ కారణంతోనే శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారట. ప్రస్తుతం అతడు ముంబైలో ఉంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఆ మధ్య అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories