మెగా వర్సెస్ అల్లు... విభేదాలపై నోరువిప్పిన అల్లు అరవింద్, రాళ్లు విసురుతున్నారంటూ సంచలన కామెంట్స్ 

Published : Sep 02, 2022, 03:48 PM IST

అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వస్తుండగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. మెగా కుటుంబంతో గొడవలు అంశంపై నోరు విప్పారు.   

PREV
17
మెగా వర్సెస్ అల్లు... విభేదాలపై నోరువిప్పిన అల్లు అరవింద్, రాళ్లు విసురుతున్నారంటూ సంచలన కామెంట్స్ 
Mega Family

టాలీవుడ్ లో అత్యధిక స్టార్స్ మెగా ఫ్యామిలీకి చెందినవారే. చిరంజీవి అనే వటవృక్షం క్రింద అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ గా ఎదిగి టాలీవుడ్ పై ఆధిపత్యం చేజిక్కించుకున్నారు. అలాగే సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ మోస్తరు హీరోలుగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 
 

27
Mega Family

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాస్తా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీగా విడిపోయారన్న టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక ఈ దూరం మరింత పెరిగిందనే వాదన ఉంది. కొన్నాళ్లుగా అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్నారు. ఆయన అల్లు రామలింగయ్య మనవడిగా పిలవబడడానికి ఇష్టపడుతున్నాడు. మెగా హీరో ట్యాగ్ ఆయనకు నచ్చడం లేదు. 
 

37
Mega Family

ఆ మధ్య జరిగిన ఓ సంఘటన వివాదాస్పదమైంది. విజయవాడ వేదికగా మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో వేయలేదు. అంతటితో ఆగకుండా అభిమాన సంఘాల అధ్యక్షుల్లో ఒకరు వేదికపై అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతడు మెగా హీరో కాదు, జనసేన అభివృద్ధికి బన్నీ ఉపయోగపడడం లేదు. అతనికి మెగా అభిమానుల నుండి ఎలాంటి మద్దతు ఉండకూడదంటూ తీర్మానం చేశాడు.

47
Mega Family

ఇది అల్లు అర్జున్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. కాగా ఒకప్పడు కలిసి కట్టుగా ఉండే మెగా ఫ్యాన్స్ విడిపోయి ఫ్యాన్ వార్ కి దిగుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్.. పవన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో గొడవకు దిగుతున్నారు. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. 
 

57
Mega Family

అభిమానులు అలానే ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఆధారంగా మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ కి విబేధాలని నిర్ణయించలేము. అయితే అల్లు అర్జున్ కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ సందర్భంలో బన్నీ '' మా మూలాలు'' అంటూ అల్లు రామలింగయ్య ఫోటో పోస్ట్ చేశాడు. అంటే తన అభివృద్ధికి కారణం తాతయ్య కానీ, మేనమామ కాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. 
 

67
Mega Family

కాగా ఈ వార్తలను అల్లు అరవింద్ ఖండించారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మా కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది వరకు ఉన్న బంధుత్వం పదిలంగా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అందువలనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. 
 

77
Mega Family

షూటింగ్స్ లో బిజీగా ఉండటం వలన అందరూ ఒకేసారి కలవలేక పోవచ్చు. పండుగలతో పాటు వేడుకలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో అందరూ ఓ చోటికి చేరి ఆనందంగా గడుపుతారు. పరిశ్రమలో పెద్దవాళ్లపై ఇలాంటి పుకార్లు పనిగట్టుకుని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.  మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories