స్టైలిష్ కా బాప్ అనిపిస్తున్న మాళవికా మోహనన్.. ట్రెండీ వేర్ లో మలయాళీ భామ కిల్లింగ్ పోజులు..

First Published | Apr 26, 2023, 4:07 PM IST

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) తన  ఫ్యాషన్ సెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.  నెటిజన్లు కూడా మంత్రముగ్ధులు అవుతున్నారు. 
 

మలయాళీ భామ మాళవికా మోహనన్ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది.  దీంతో తన క్రేజ్ అంతకంతకూ  పెరిగిపోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. 

తాజాగా మాళవికా మోహనన్ ముంబైలో దర్శనమిచ్చింది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ ఫొటోషూట్లు చేస్తోంది. ఆ ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఖుషీ చేస్తోంది.  
 


ఓవైపు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తోంది. ట్రెండీ వేర్స్ లో గతంలో స్టైలిష్ గా మెరిసిన  విషయం తెలిసిందే. ఇక తాజాగా అల్ట్రా స్టైలిష్ గా దర్శనమిచ్చింది.  నయా లుక్ లో మైమరిపించింది.  లాంగ్ లెన్త్ స్లీవ్ లో మ్యాచింగ్ జ్యూయెల్లరీ ధరించి సూపర్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

దానికితోడు సనె గ్లాసెస్ ధరించి, లూస్ హెయిర్ తో అట్రాక్టివ్ గా కనిపించింది. అదిరిపోయే అవుట్ ఫిట్ ధరించిన ఈ ముదుగుమ్మ ముంబై వీధుల్లో తిరుగుతూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా  ఫొటోలకు స్టన్నింగా ఫోజులు కూడా ఇచ్చింది. మాళవికా స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

యంగ్ హీరోయిన్ మాళవికా అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలోనూ ఇలా సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది.  దీంతో నెటిజన్లు కూడా మాళవికాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె పంచుకునే పోస్టులను లైక్స్,  కామెంట్లతో క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. 

కేరీర్ విషయానికొస్తే.. మాళవిక మోహనన్ ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన ‘తంగలన్’ (Thangalaan)లో నటిస్తోంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో ‘యుద్ర’అనే చిత్రంలోనూ మెరియనుంది. ఇక టాలీవుడ్ లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!