మేకప్ తో వెళ్లిన హీరోయిన్, ముఖం కడిగించే వరకు ఊరుకోలేదు..పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ పరిస్థితి

First Published | Aug 3, 2024, 6:15 PM IST

చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. హీరోయిన్లని అందంగా చూపించేందుకు మేకప్ మెన్లు, డైరెక్టర్స్, కెమెరామెన్లు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.

చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. హీరోయిన్లని అందంగా చూపించేందుకు మేకప్ మెన్లు, డైరెక్టర్స్, కెమెరామెన్లు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి హీరోయిన్ అందంగా కనిపించాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ అంటే ముందుగా ఖుషి పేరే చెబుతారు. 

ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించారు. ఖుషి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య వచ్చే ప్రతి సన్నివేశం హైలైట్ అనిపించే విధంగా ఉంటుంది. పవన్ చేసే అల్లరి, భూమిక పెర్ఫామెన్స్ అప్పటి యువతని ఉర్రూతలూగించాయి. 


ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన సంఘటనలని భూమిక ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక ఒక గుడిలో దీపం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టే సన్నివేశం ఉంది. ఆ సీన్ కోసం భూమిక లైట్ గా మేకప్ వేసుకుని వెళ్లిందట. 

భూమిక మేకప్ వేసుకుని వచ్చిందని పిసి శ్రీరామ్ గమనించారు. వెంటనే సీన్ షూటింగ్ ఆపేసి మేకప్ పూర్తిగా పోయేలా ముఖం కడగమని చెప్పారట. తాను లైట్ గా మేకప్ వేసుకున్నానని చెప్పినా వినలేదట. బహుశా ఆయన మూడ్ ఆ టైం లో సరిగ్గా లేదేమో అని భూమిక తెలిపింది. 

పిసి శ్రీరామ్ గారు నన్ను నేచురల్ గా చూపించడానికే ఇష్టపడ్డారు. ఖుషిసినిమా మొత్తం నేను ఎక్కడా మేకప్ వేసుకోలేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో లైట్ గా వేసుకున్నా అని భూమిక తెలిపింది. 

ఫస్ట్ టైం పిసి శ్రీరామ్ గారు వెళ్లి ముఖం కడుక్కో అని చెప్పినప్పుడు చాలా బాధపడినట్లు భూమిక తెలిపింది. ఆ తర్వాత అలవాటైపోయిది అని భూమిక తెలిపింది. అంటే భూమిక ఏమాత్రం మేకప్ వేసుకోకుండా నటించిన ఖుషి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందన్నమాట. 

Latest Videos

click me!