ఆర్ నారాయణమూర్తి ప్రేమ కథ, అందుకే బ్యాచిలర్ గా మిగిలిపోయాడా..?

First Published | Dec 20, 2024, 6:05 PM IST

ఆర్ నారాయణమూర్తి అనగానే ఎర్రజెండా నీడ.. ప్రజా సమస్యల సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆయన లైఫ్ టైమ్ బ్యాచిలర్ అయిన అందరికి తెలుసు. కాని ఆయన జీవితంలో ఓ ప్రేమ కథ ఉందని ఎవరికైనా తెలుసా..? 
 

ఆర్.నారాయణమూర్తి ఈ పేరు వినగానే గౌరవంతో చేతులు పైకి లేస్తాయి. రోడ్డు మీద సామాన్యుడిలా వెళుతున్న ఆయనకు కోట్ల విలువ చేసే కారులో వెళ్లేవారు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తుంటారు. అది ఆయన గొప్పతనం. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లోనారాయమూర్తి తెలియనివారంటూ ఉండరు.

ఆయన సినిమా గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు, దర్శకులు ఉన్నారు కాని.. అందరిది ఒక లెక్క అయితే ఆర్ నారాయణమూర్తిది ఒక లెక్క.. ఆయనది  ఓ సపరేట్ స్టైల్. ఇక నారాయణమూర్తి మల్టీ టాలెంటెడ్ అని అందరికి తెలిసిందే. 

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, మాటల రచయితగా ఇలా ఎన్నో పాత్రలను ఆయన సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు.  కెమెరాకి ముందు వెనకాల ఒకేలా ఉండే వ్యక్తిత్వం ఆర్‌ నారాయణమూర్తి సొంతం. విప్లవ సినిమాలకు పెట్టిందిపేరుగా నిలిచిన నారాయణమూర్తి.. సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన నారాయణమూర్తి.. ఎన్నో సినిమాలు చేశారు. 
 


R.narayana murthy

కాని డబ్బుకోసం ఎప్పుడూ సినిమాను చేయలేదు ఆయన. ప్రజలకోసం.. ప్రజలకు ఉపయోగపడాలని మాత్రమే సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళలేదు నారాయణమూర్తి. కోట్లిస్తాం అని ఆఫర్ చేసినా. .సున్నితంగా తిరస్కరించారు నారాయణ మూర్తి.  ఆయన సినిమాల్లోనూ ప్రజల బాధలు విప్లవ భావాలే కనిపిస్తాయి.. దాసరి నారాయణరావు ను గురువగా పూజిస్తూ..గౌరవించే నారాయణమూర్తి.. కృషికి, పట్టుదలకు, మంచితనానికి నిదర్శనంగా నిలిచారు. 

ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడిపే నారాయణమూర్తి, రోడ్డు పక్కన హోటల్స్ లో హ్యాపీగా తింటారు,ఆర్టీసీ బస్సులోప్రయాణిస్తారు. 70 ఏళ్ల నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదు. లైఫ్ టైమ్ బ్యాచిలర్ గానే ఉన్నారు. ఇక ఏజ్ ఎక్కువయినప్పుడు మాత్రం ఆయన రియలైజ్ అయ్యారు.

నాలాగా ఉండకండి.. పెళ్ళి చేసుకుంటేనే..మన బాగోగులు చూసుకోడానికి కుటుంబం ఉంటుంది అన్నారు. అప్పుడప్పుడు నాకు బాలేకపోతే.. అడిగే దిక్కు లేకుండా పోయింది అన్నారు. అయితే నారాయణమూర్తి పెళ్లి అయితే చేసుకోలేదు కాని.. ఆయనకు కూడా  ఓ ప్రేమ కథ ఉంది అని ఎంత మందికి తెలుసు.

నారాయణమూర్తి ఓ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి ఆరాధించారట. కానీ ఆ ప్రేమ కథ  సుఖాంతం కాలేదు .. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ తన ప్రేమ కథ గురించి చెప్పారు.ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన ప్రేమ కథ గురించి చెప్పారు.
 

మీరు మీ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా..? మీజీవితంలో ప్రేమ ఉందా అని ప్రశ్నించగా.. నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. ఆమె కూడా  నన్ను ప్రేమించింది. అయితే ఆ అమ్మాయిన నన్ను వాళ్ల ఫ్యామిలీకి పరిచయం చేయాలని చూశారు. వాళ్ల ఇంట్లో వాళ్లు చూడాలి అంటే.. నేను వెళ్లాను. కాని ఆ అమ్మాయి వాళ్లు బాగా కలిగిన ఫ్యామిలీ..పెద్ద ఇల్లు.. కార్లు విలాసవంతమైన జీవితం. అవన్నీ చూసిన తరువాత నేను వెంటనే బయటకు వచ్చేశాను. అన్నారు. 

narayana murthy

ఎందుకుంటే నా జీవితం వేరు.. ఆ అమ్మాయి జీవితం వేరు. నాది ప్లాట్ ఫ్రమ్ జీవితం ఆమె చాలా డబ్బున్న అమ్మాయి నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి నాలా ఫ్లాట్ ఫారం మీద పెట్టకూడదు. నా కోరిక సినిమాల్లో నటించడం నాకు అవకాశాలు వస్తాయో.. రావోనేను లైఫ్ లో సెటిల్ అవ్వడానికి  ఎన్నేళ్లు పడుతుందో ఏమో తెలియదు..

ఇటువంటి టైమ్ లో  ఆ అమ్మాయిని పెళ్ళాడి,  తెచ్చుకొని ఆమె జీవితాంతం నరకయాతన పడటం అని ఆమెకు వివరంగా చెప్పాడట. అంతే కాదు  నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు వేరే పెళ్లి చేసుకుని మీ జీవితంలో హ్యాపీగా ఉండండి అని అన్నారట. ఇక అప్పటి నుంచి ప్రేమ జోలికి వెళ్ళలేదట నారాయణ మూర్తి. లైఫ్ లాంట్ బ్యాచిలర్ గా ఉండిపోయాడట. ప్రేమ పెళ్లే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్ళి కూడా ఆయన రిజెక్ట్ చేశారట. 
 

Latest Videos

click me!