ఇప్పటికీ ఈ ప్రచారం ఉంది. దీనిపై జయలలిత పర్సనల్ మేకప్ మ్యాన్ అసలు విషయం బయటపెట్టారు. శోభన్ బాబుకి, జయలలితకు కూతురు ఉన్నారనేది అబద్దమని, వారికి పిల్లలు లేరని తెలిపారట.
వారు మంచి స్నేహితులని మేకప్ మ్యాన్ వెల్లడించినట్టు సీనియర్ నటి సత్య ప్రియ సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జయలలితకి పనిచేసిన మేకప్ మ్యాన్ నటి సత్యప్రియ వద్దకు కూడా పనిచేశారు.
ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన విషయాలను తనతో పంచుకునేవాడట. కానీ శోభన్ బాబు, జయలలిత మంచి అందమైన జంట అని, వారు సహజీవనం చేసినది కూడా నిజమే అని నటి సత్యప్రియ వెల్లడించడం విశేషం.