వేల కోట్ల వ్యాపారం వదులుకుని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా? సొంత ఐడెంటిటీ కోసం ఆరాటం

Published : Jun 07, 2025, 07:33 AM ISTUpdated : Jun 07, 2025, 11:28 AM IST

అఖిల్‌ అక్కినేని వ్యాపార కుటుంబానికి చెందిన జైనబ్‌ రవ్‌డ్జీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వేల కోట్ల బిజినెస్‌లుఉన్నా, జైనబ్‌ వాటిని వదిలేసి చేస్తున్న పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

PREV
15
గ్రాండ్‌గా అఖిల్‌-జైనబ్‌ల పెళ్లి వేడుక

అఖిల్‌ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌ని పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 3.35 గంటలకు జైనబ్‌ మెడలో మూడు ముళ్లు వేశారు అఖిల్‌. 

తమ ఇంట్లో పెళ్లి వేడుక పట్ల నాగార్జున, అమల సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరు అఖిల్‌ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. నాగచైతన్య కూడా తన సంతోషం వ్యక్తం చేస్తూ మరదలిని తన కుటుంబంలోకి ఆహ్వానించారు.

25
అఖిల్‌ భార్య జైనబ్‌ ఫ్యామిలీకి వేల కోట్ల బిజినెస్‌లు

ఇదిలా ఉంటే అఖిల్‌ పెళ్లి చేసుకున్న జైనబ్‌ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వారిది బిజినెస్‌ ఫ్యామిలీ. వాళ్ల నాన్న జుల్ఫీ రవ్‌డ్జీ కి వేల కోట్ల బిజినెస్‌లున్నాయి. కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. 

అంతేకారు పవర్‌ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వందల, వేల కోట్ల టర్నోవర్‌ తో నడుస్తున్న వ్యాపారాలు. అయితే పవర్‌ ప్రాజెక్ట్ లను జైనబ్‌ సోదరుడు జైన్‌ చూసుకుంటున్నారు. కానీ జైనబ్‌ మాత్రం బిజినెస్‌లో ఇన్‌ వాల్వ్ కాదట.

35
సొంత బిజినెస్‌లు కాదని జైనబ్‌ చేస్తున్నపని ఇదే

సాధారణంగా ఇలా వ్యాపారాలు ఉన్న వారి పిల్లలు తమ బిజినెస్‌లనే చూసుకుంటారు. కానీ జైనబ్‌ అందుకు దూరంగా ఉంటుందట. సొంతంగా ఎదగాలనే తపనతో ఉందట. తన సొంత ఆర్ట్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందట. 

ఆమె స్వతహాగా మంచి ఆర్టిస్ట్(పెయింటింగ్‌). లేటెస్ట్ ట్రెండ్‌ని తన ఆర్ట్ లో ఆవిష్కరిస్తూ బొమ్మలు వేస్తూ ప్రదర్శిస్తోందట. హైదరాబాద్‌లోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. పలుమార్లు  ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు. అంతేకాదు ఇండియాలోని ప్రధాన నగరాల్లో, ఇతర కంట్రీస్‌లో కూడా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

45
ఆర్టిస్ట్ గా విశేష గుర్తింపు

మీడియా పరంగా, పబ్లిసిటీకి జైనబ్‌ దూరంగా ఉంటారు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. తాను తన ఆర్ట్ ప్రదర్శనలు ఇచ్చినా, పబ్లిసిటీని ఇష్టపడరు. అందుకే మీడియా పరంగా ఆమె ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఫాలోవర్స్ కి, ఆమె పెయింటింగ్స్ ని ఇష్టపడే వారు మాత్రం వేలల్లో ఉన్నారట. దీంతోపాటు మరో వెల్‌ నెస్‌ సెంటర్‌ని కూడా నడిపిస్తోంది జైనబ్‌.

55
స్కిన్‌ కేర్‌ టిప్స్ ఇస్తున్న జైనబ్‌ రవ్‌డ్జీ

జైనబ్‌ స్కిన్‌ కేర్‌కి సంబంధించిన వెల్‌నెస్‌ సెంటర్లని నడిపిస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో దీన్ని రెగ్యూలర్‌గా మెయింటేన్‌ చేస్తోంది. @onceupontheskin పేరుతో ఒక ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ని మెయింటేన్‌ చేస్తోంది. ఇందులో ఆమె చర్మ రక్షణ, పోషణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది. 

చర్మాన్ని ఎలా సురక్షితంగా, సౌందర్యవంతంగా ఉంచుకోవాలో ఆమె రెగ్యూలర్‌గా టిప్స్ ఇస్తోంది. అలాగే బ్యూటీ ప్రొడక్ట్ ల రివ్యూలు ఇస్తోంది. అయితే సినిమా ఫ్యామిలీలోకి వచ్చిన జైనబ్‌కు సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదట. వాటిని చూడటం కూడా చాలా తక్కువే కావడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories