రియల్ లైఫ్‌లో సమంత, చైతూ విడిపోయారు. అందుకు ఇంకా చాలా కారణాలున్నాయనే టాక్ ఉంది. సినిమాలో మాత్రం అలా జరగలేదు. మనస్పర్థాలు వచ్చాయి, ఇంటికెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాటిక్ లిబర్టీ మేరకు జరిగింది. కొన్ని ఎలిమెంట్లు కాస్త దగ్గరగా ఉన్నాయి. అలాగని సమంత బయోపిక్ అని చెప్పలేం, ఎందుకంటే ఈ సినిమా కథని మూడేళ్ల క్రితమే దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్నారు. సమంత, విజయ్‌లకు చెప్పారు. అప్పుడే సినిమా సెట్ అయ్యింది. కానీ సమంత జీవితంలో ఆ తర్వాత జరిగింది. ఈ కారణంగా `ఖుషి`ని, సమంత జీవితంతో పోల్చలేం. రెండు భిన్నమైనవే, కానీ కొన్ని యాదృశ్చికంగా ఒకేలా జరగడం విచాకరం. దీన్ని పట్టుకుని `ఖుషి` సమంత బయోపిక్ అనడం సరైనది కాదు.