మంచు లక్ష్మి రాఖీ సందర్భంగా మనోజ్ కి రాఖీ కట్టింది. ఈ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ తర్వాత మంచు లక్ష్మి.. మనోజ్, అతడి భార్య భూమా మౌనిక, బావమరిది జగత్ విఖ్యాత్ రెడ్డితో కలసి డిన్నర్ చేశారు. కానీ ఎక్కడా మంచు విష్ణు ప్రస్తావన లేదు. మంచు విష్ణుకి రాఖీ కట్టిన ఫొటోస్ ని కూడా మంచు లక్ష్మి షేర్ చేయలేదు.