ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో `స్టూడెంట్ నెం 1`, `సింహాద్రి`, `యమదొంగ`, `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాలున్నాయి. ఇది రాజమౌళితోనే కాదు, వారి ఫ్యామిలీతోనూ క్లోజ్ రిలేషన్ ఏర్పడ్డానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాకి వాళ్ల ఫ్యామిలీ అంతా పనిచేస్తుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌గా ఉంటాడు, అలాగే కీరవాణి సంగీతం అందిస్తారు, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ చూసుకుంటారు. వల్లీ కూడా అదే పనిలో ఉంటుంది. కాళభైరవ మ్యూజిక్‌లో భాగమవుతుంటాడు. ఇలా ఫ్యామిలీ ప్యాక్‌గా పని చేస్తుంటారు.