Dhurandhar Box Office Collection : బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది ధురంధర్ సినిమా. రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 16 రోజు దేశీయ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు సంపాదించిన ఏడవ బాలీవుడ్ సినిమాగా నిలిచింది. యానిమల్ కలెక్షన్స్ పై కన్నేసింది.
ధురంధర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ షాకిస్తున్నాయి. రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ కలెక్షన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. మూడో శనివారం ఈసినిమా వసూళ్లలో మళ్లీ పెరుగుదల కనిపించింది. బాక్సాఫీస్ వద్ద దాని అద్భుతమైన ప్రదర్శనకు ఈ కలెక్షన్స్ ఊపునిచ్చాయి.
27
16వ రోజు ధురంధర్ వసూళ్లు
ధురంధర్ 16వ రోజున దేశీయ కలెక్షన్లలో భారీ పెరుగుదల కనిపించింది. శుక్రవారంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వసూళ్లను ఈసినిమా రాబడుతోంది. భారత్‌లో దీని కలెక్షన్ ఇప్పటికే 500 కోట్ల మార్కును దాటింది.
37
ధురంధర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ?
ధురంధర్ టిక్కెట్ విండో వద్ద మొదటి 15 రోజుల్లో 483 కోట్ల నెట్ వసూలు చేసింది. రికార్డు బ్రేకింగ్ రెండో వారం తర్వాత, మూడో వారాన్ని కూడా మంచి ప్రారంభంతో మొదలుపెట్టింది. శుక్రవారం ఒక్క రోజు ఈసినిమా 22.50 కోట్లు సంపాదించింది.
వీకెండ్ లో కూడా ఈసినిమా అద్భుతం చేసింది. శనివారం ధురంధర్ కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఉదయం షోలలో 32.26% ఆక్యుపెన్సీ నమోదైంది. Sacnilk ప్రకారం, రాత్రి 9.30 గంటల వరకు ధురంధర్ దేశీయ నెట్ వసూళ్లు ₹29 కోట్లు కాగా.. మొత్తంగా 512 కోట్లు పూర్తయ్యాయి.
57
స్టార్ హీరోలను భయపెడుతోంది
ధురంధర్ ఇప్పుడు గదర్ 2 (₹525 కోట్లు), పఠాన్ (₹543 కోట్లు), యానిమల్ (₹553 కోట్లు) వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌ల వెనుక ఉంది. దీని వేగాన్ని చూస్తుంటే, ఆదివారం రాత్రికి ఈ సినిమాలను దాటేయడం పక్కాగా తెలుస్తోంది. ఈ లెక్కన స్టార్ హీరోలు కూడా ఈసినిమాను చూసి భయపడే పరిస్థితి వచ్చింది.
67
1000 కోట్లు సాధిస్తుందా?
ధురంధర్ ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో టాప్ 3 బాలీవుడ్ చిత్రాలైన స్త్రీ 2 (₹598 కోట్లు), ఛావా (₹601 కోట్లు), జవాన్ (₹640 కోట్లు)లను దాటే దిశగా సాగుతోంది. ధురంధర్ 700 కోట్ల మార్కును దాటగలదని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అంతకు మించి సాధించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
77
కరాచీ గ్యాంగ్, టెర్రరిస్ట్ కథతో..
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ ధురంధర్‌లో, కరాచీ గ్యాంగ్, టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌లోకి చొరబడిన భారతీయ ఆపరేటివ్ హమ్జాగా రణవీర్ నటించాడు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ సందడి చేశారు. అక్షయ్ ఖన్నా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.