ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?

Published : Apr 03, 2026, 09:23 AM IST

ధురంధర్ ది రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ సినిమాగా నిలిచింది. అయినా ఒక తెలుగు సినిమా రికార్డును మాత్రం 'ధురంధర్ 2' బ్రేక్ చేయలేకపోయింది. రెండో వారంలో టాప్ 5 కలెక్షన్లు  సినిమాల లిస్ట్ ఇదే.

PREV
15
5. బాహుబలి 2 : ది కన్‌క్లూజన్ (2017)
రెండో వారంలో వసూళ్లు: ₹143.25 కోట్లు (హిందీ వెర్షన్ మాత్రమే). ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ తెలుగు పాన్ ఇండియా సినిమా, రెండో వారంలో దేశవ్యాప్తంగా ₹264 కోట్లు వసూలు చేసింది. దీని లైఫ్‌టైమ్ కలెక్షన్ ₹1030.42 కోట్లు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి నటించిన ఈ సినిమా ఒక్క హిందీ వెర్షన్‌తోనే ₹510.99 కోట్లు రాబట్టింది.
25
4. ఛావా (2025)

రెండో వారంలో వసూళ్లు: ₹180.25 కోట్లు. ఇది బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉతేకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాలో లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్‌గా ₹601.54 కోట్లు సాధించింది. ఇది కూడా 

35
3. పుష్ప 2 : ది రూల్ (2024)
రెండో వారంలో వసూళ్లు: ₹196.50 కోట్లు (హిందీ వెర్షన్). ఇది తెలుగు సినిమా నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రం. ఇందులో అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో నటించగా, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కూడా కనిపించారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రెండో వారంలో దేశవ్యాప్తంగా ₹264.80 కోట్లు వసూలు చేసింది. లైఫ్‌టైమ్ కలెక్షన్ విషయానికొస్తే, ఇండియాలో ₹1,234.10 కోట్లు వసూలు చేయగా, ఒక్క హిందీ వెర్షనే ₹812.14 కోట్లు కొల్లగొట్టింది.
45
2. ధురంధర్ ది రివెంజ్ (2026)

రెండో వారంలో వసూళ్లు: ₹242.75 కోట్లు (హిందీ వెర్షన్). ఈ బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా రెండో వారంలో దేశవ్యాప్తంగా ₹263.15 కోట్లు రాబట్టింది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ పోషించాడు. అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి నటులు కూడా ఇందులో ఉన్నారు. ఈ సినిమా 15 రోజుల్లో ఇండియాలో ₹937.32 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీ వెర్షన్ కలెక్షనే ₹878.79 కోట్లు. ః

55
1. ధురంధర్ (2025)
రెండో వారంలో వసూళ్లు: ₹253.25 కోట్లు. ఇది బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా. 'ధురంధర్ ది రివెంజ్' సినిమాకు ఇది ఫస్ట్ పార్ట్. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కూడా దాదాపు అవే నటీనటులు ఉన్నారు. కానీ, ఇందులో అక్షయ్ ఖన్నా మెయిన్ విలన్‌గా కనిపించాడు. ఈ సినిమా ఇండియాలో లైఫ్‌టైమ్ ₹840.20 కోట్లు సంపాదించింది.
Read more Photos on
click me!

Recommended Stories