Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు

Published : Apr 03, 2026, 08:59 AM IST

Illu Illalu Pillalu April 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో శ్రీవల్లి, చందు చుట్టే కథంతా తిరుగుతుంది. చందు భార్య గురించి తెలుసుకొని చాలా బాధపడతాడు. ఇక వల్లి తల్లిదండ్రులకు గట్టిగానే క్లాసు పీకుతుంది. ఇక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
భాగ్యంపై చెయ్యెత్తిన వల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో వల్లిని పుట్టింటి దగ్గర వదిలేస్తాడు చందు. వల్లి పుట్టింట్లో కూర్చుని ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ అడుగుతారు. ‘కూలిపోయింది.. నా కాపురం నిలువునా కూలిపోయింది. అమూల్యను ప్రేమించమని చెప్పింది, వాళ్ళిద్దరి మధ్య నేను చేసిన ప్రేమ రాయబారం అన్నింటినీ ఆ ప్రేమ, నర్మద మా ఆయనకి తెలిసేలా బయట పెట్టేసారు’ అని జరిగిందంతా వల్లి తల్లిదండ్రులకు చెబుతుంది. 

భాగ్యం మాట్లాడుతూ ‘ఆ ప్రేమ, నర్మద చాలా మంచోళ్ళు కదే.. ఏదో నిన్ను భయపెట్టడానికి ఆటాడుకుంటున్నారు అనుకున్నాను కానీ ఇలా చేస్తారనుకోలేదు. నమ్మలేకపోతున్నాను’ అంటుంది భాగ్యం. దానికి వల్లి కోపంగా చేసినదంతా మీరైతే వాళ్లని అంటారేంటి అని తల్లిదండ్రులను కొట్టేందుకు చెయ్యెత్తుతుంది. కానీ కొట్టకుండా ఆగిపోతుంది. ‘అబద్ధాలు చెప్పొద్దు చెప్పొద్దు అని మిమ్మల్ని బతిమిలాడాను. మోసాలు చేయొద్దని వేడుకున్నాను. కానీ మేము ఏం చేసినా నువ్వు బాగుండాలని, నీ కాపురం సంతోషంగా ఉండడం కోసమే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు. మోసాల మీద మోసాలు చేశారు. నేను, నా కాపురం బాగుండడం కాదు కదా నేను చేసిన తప్పుల వల్ల నాకు కాపురమే లేకుండా పోయింది’ అని ఏడుస్తుంది.

భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూతురిని ఏడవద్దని ఓదార్పుతారు. అయినా కూడా వల్లి ఏమాత్రం తగ్గకుండా ‘మీ వల్ల నాకేం మిగిలింది. ఆ భద్రావతీ వాళ్ళకి మా మామయ్య గారికి పడదు. వాళ్లతో మనకు వద్దని ఎన్నిసార్లు చెప్పాను. వాళ్లతో చేతులు కలిపి మీ చేతులతో మీరే నా కుటుంబాన్ని కూల్చేస్తారు. నన్ను కళ్ళల్లో పెట్టుకుని ప్రాణంగా చూసుకునే నా భర్త నువ్వు నాకు వద్దు అని నన్ను వదిలిపెట్టి పరిస్థితికి తీసుకొచ్చారు. అంతా వీ వల్లే. నా జీవితాన్ని నాశనం చేశారు. నా బావ దూరమైతే నేను బతకను’ అని ఏడుస్తుంది వల్లి.

24
కనిపించని చందు, వల్లి

ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. శ్రీరామనవమి పూజకి అంతా సిద్ధంగా ఉంటారు. అదే సమయానికి భద్రావతి తల్లి, పెద్దమ్మ కూడా వస్తారు. చందు, వల్లి ఇక్కడ లేరు కాబట్టి కళ్యాణంలో ఎవరు కూర్చుంటారు అని అడుగుతుంది పెద్దమ్మ. పెద్దోడిని, వల్లిని తీసుకురమ్మని చెబుతాడు రామరాజు. నర్మద, ప్రేమ వల్లి గదిలోకి వెళ్లి వెతుకుతారు. కానీ వాళ్ళు కనిపించరు. రామరాజు పెద్దోడా పెద్దోడా అని పిలుస్తూ ఉంటే అదే సమయానికి చందు ఇంట్లోకి వస్తాడు. ‘బయటి నుంచి వస్తున్నావ్ ఏంటి ఇప్పుడు వరకు ఎక్కడున్నావ్? పూజకి టైం అవుతుంది. వల్లి ఎక్కడ ఉంది’ అని అడుగుతారు రామరాజు, వేదవతి. ‘వల్లి ఇంట్లో లేదు. నేనే తనని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చాను. వల్లి వాళ్ళ అమ్మ కాలు జారి కింద పడిపోయింది అంటా. వాళ్ళ అమ్మకి ఏమైందో ఏమో అని వల్లి టెన్షన్ పడుతుంటే.. తనను తీసుకెళ్లి ఇంట్లో వదిలేసి వచ్చాను’ అని చెబుతాడు చందు. అర్జెంటుగా రైస్ మిల్లుకు వెళ్లాలని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు చందు.

34
తీవ్రమైన బాధలో చందు

చందు వెంటే ప్రేమ, నర్మదా కూడా బయటికి వెళ్తారు. ‘కరెక్ట్ కాదు బావ. వల్లి విషయంలో మీరు చేసింది కరెక్ట్ కాదు. మేము తనకి బుద్ధి చెప్పాలనుకున్నాం. అంతే తప్ప తన ఇంట్లోంచి వెళ్లిపోవాలనీ, తన కాపురం సమస్యల్లో పడాలనీ మేము కోరుకోలేదు. వల్లి అక్క గురించి మీరు మావయ్య వాళ్లకి అర్థం అయ్యేలా చెబుతారు అనుకున్నాం. మీరేంటి బావ ఆమెను పుట్టింట్లో వదిలేసి వచ్చారు’ అని అడుగుతారు. చందు మాట్లాడుతూ ‘నా భార్య గురించి నాకు చెప్పారు. నిర్ణయం నాకే వదిలిపెట్టారు. తను మహాలక్ష్మి, దేవత అని నాన్న అనుకుంటున్నారు. తన గురించి తెలిస్తే నాన్న తట్టుకోలేరు. అందుకే నేనే సరైన నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఇంట్లో వాళ్లకి తెలిస్తే నా మీదే ఒట్టే’ అని చెప్పి బండిపై బయటికి వెళ్ళిపోతాడు. బండి పై వెళ్తున్న చందుకు వల్లితో జరిగిన పెళ్లి గుర్తొస్తుంది. అలాగే అమూల్య చెప్పిన విషయాలు కూడా గుర్తొస్తాయి. ఒకచోట ఆగి చాలా బాధపడుతూ ఉంటాడు చందు .

44
ధీరజ్ కు నచ్చజెప్పిన వేదవతి

ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. పూజలో రామరాజు వేదవతి జంటతో పాటు సాగర్, నర్మదా కూర్చుంటారు. సాగర్ కూర్చోవడం రామరాజుకు ఇష్టం ఉండదు. సాగర్ కూర్చుంటే తాను పూజలో ఉండనని చెబుతాడు రామరాజు. దీంతో సాగర్ లేచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ ప్రేమను కూర్చొమని చెబుతుంది వేదవతి. ప్రేమ వచ్చి కూర్చుంటుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమ పక్కన కూర్చోవడానికి ఇష్టపడడు. దీంతో వేదవతి లేచి ధీరజ్ పై కోప్పడుతుంది. ‘అమూల్య విషయంలో తను చేసింది నేను భరించలేకపోతున్నాను. అందుకే తనతో కలిసి నేను పూజ చెయ్యను’ అని ధీరజ్ చెబుతాడు. అప్పుడు వేదవతి ధీరజ్ చెయ్యి పట్టుకొని దూరంగా తీసుకెళ్తుంది.

 ‘బుద్ధుందా నీకు. ప్రేమే గనక లేకపోయి ఉంటే, అమూల్య మెడలో తాళి కట్టుకోమని ప్రేమ చెప్పకపోయి ఉంటే ఈరోజు అమూల్య మన కళ్ళ ముందు ఉండేదే కాదు. ప్రేమ కేవలం మన కుటుంబం గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంది. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చాలా జరిగాయి. అవన్నీ నేను నీకు చెప్పలేను. అమూల్య విషయంలో ప్రేమ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి స్వార్థం ,తప్పు లేదు. ఈ విషయం మీకు త్వరలోనే అర్థమవుతుంది’ అని చెబుతుంది. అక్కడినుంచి ధీరజ్ ను తీసుకొచ్చి ప్రేమ పక్కన పూజలో కూర్చోబెడుతుంది. రెండు జంటలు కలిసి శ్రీరామనవమి పూజను ఘనంగా చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories