రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ : ది రివెంజ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆగడం లేదు. రెండో శనివారం కూడా వసూళ్ల వర్షం కురిపించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు అమాంతం పెరిగాయి. 10 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ట్రేడ్ వెబ్‌సైట్ sacnilk.com ఫైనల్ రిపోర్ట్ ప్రకారం, 'ధురంధర్ : ది రివెంజ్' 10వ రోజు దేశవ్యాప్తంగా రూ.62.85 కోట్లు రాబట్టింది. దీంతో ఈ స్పై యాక్షన్ డ్రామా మొత్తం కలెక్షన్ రూ.778.77 కోట్లకు చేరింది. ఈ వసూళ్లన్నీ అన్ని భాషల వెర్షన్లు కలిపి ఉన్నాయి.
25
ధురంధర్ : ది రివెంజ్' హిందీ వసూళ్లు ?
రిపోర్టుల ప్రకారం, 'ధురంధర్ 2'హిందీ వెర్షన్ రెండో శనివారం సుమారు రూ.58 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిందీ వెర్షన్ మొత్తం వసూళ్లు రూ.748.5 కోట్లు దాటాయి. హిందీ బెల్ట్‌లో రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో సినిమాగా ఇది నిలిచింది.
35
భారత్‌లో 700 కోట్ల క్లబ్‌లో హిందీ సినిమాలు ?
భారత్‌లో రూ.700 కోట్లకు పైగా వసూలు చేసిన హిందీ సినిమాలు కేవలం మూడే ఉన్నాయి. మొదటి, మూడో స్థానాల్లో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ' (రూ.895.96 కోట్లు), 'ధురంధర్ : ది రివెంజ్' (రూ.748.5 కోట్లు+) ఉన్నాయి. రెండో స్థానంలో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' హిందీ వెర్షన్ (రూ.830.10 కోట్లు) ఉంది.
ఇండియాలో రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన మొత్తం భారతీయ సినిమాల సంఖ్య 6. ఆ సినిమాల పూర్తి జాబితా, వాటి పాన్-ఇండియా కలెక్షన్లు ఇవిగో:
పుష్ప 2 : ది రూల్ (తెలుగు పాన్ ఇండియా): రూ.1234.10 కోట్లు
బాహుబలి 2 : ది కన్‌క్లూజన్ (తెలుగు పాన్ ఇండియా): రూ.1030.32 కోట్లు
ధురంధర్ (హిందీ): రూ.895.96 కోట్లు
KGF చాప్టర్ 2 (కన్నడ పాన్ ఇండియా): రూ.859 కోట్లు
RRR (తెలుగు పాన్ ఇండియా): రూ.782.20 కోట్లు
ధురంధర్ : ది రివెంజ్ (హిందీ పాన్ ఇండియా): రూ.778.77 కోట్లు*
55
10 రోజుల్లో ధురంధర్ 2 వరల్డ్‌వైడ్ కలెక్షన్ ?
'ధురంధర్ 2' పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,226.44 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ సుమారు రూ.930.44 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.296 కోట్లు రాబట్టింది. ఈ వసూళ్లతో ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.1,160 కోట్లు), యశ్ 'KGF చాప్టర్ 2' (రూ.1,215 కోట్లు) రికార్డులను బద్దలు కొట్టింది.