Dhurandhar 2 Collection: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. 7వ వారంలో కూడా మంచి పట్టు నిలుపుకుని, సంతృప్తికరమైన వసూళ్లతో ముగించింది. 50 రోజుల తర్వాత ఈ సినిమా మొత్తం కలెక్షన్ ఎంత ఉందో తెలుసుకుందాం.
రణ్ వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2` మూవీ ఇంకా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇండియన్ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేసిన తర్వాత కూడా ఈ సినిమా ఇంకా థియేటర్లో ఆడుతోంది. మంచి వసూళ్లని రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com రిపోర్ట్ ప్రకారం, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్: ది రివెంజ్' 50వ రోజున (రిలీజ్ తర్వాత 8వ గురువారం) సుమారు రూ.50 లక్షల నెట్, రూ.59 లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 49వ రోజు వసూళ్లతో (నెట్ రూ.52 లక్షలు) పోలిస్తే, కలెక్షన్లలో దాదాపు 15.1 శాతం తగ్గుదల కనిపించింది.
25
'ధురంధర్ 2' ఏడో వారం కలెక్షన్లు
'ధురంధర్: ది రివెంజ్' 7వ వారంలో దాదాపు రూ.5.58 కోట్లు వసూలు చేసింది. ఈ వారంలో రోజువారీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి:
7వ శుక్రవారం (44వ రోజు) : రూ.1.05 కోట్లు
7వ శనివారం (45వ రోజు) : రూ.1.15 కోట్లు
7వ ఆదివారం (46వ రోజు) : రూ.1.31 కోట్లు
7వ సోమవారం (47వ రోజు) : రూ.50 లక్షలు
7వ మంగళవారం (48వ రోజు) : రూ.55 లక్షలు
7వ బుధవారం (49వ రోజు) : రూ.52 లక్షలు
8వ గురువారం (50వ రోజు) : రూ.50 లక్షలు
7వ వారం మొత్తం కలెక్షన్ : రూ.5.58 కోట్లు
35
'ధురంధర్ 2' 50 రోజుల కలెక్షన్ ఎంత?
'ధురంధర్ 2' 50 రోజుల్లో ఇండియాలో నెట్ రూ.1,140.67 కోట్లు సంపాదించింది. దీని గ్రాస్ కలెక్షన్ రూ.1365.20 కోట్లకు చేరింది. ఈ స్పై యాక్షన్ డ్రామా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు రూ.426.35 కోట్లు రాబట్టింది. మొత్తంగా 50 రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1791.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రిపోర్టుల ప్రకారం, 'ధురంధర్: ది రివెంజ్' సినిమాను దాదాపు రూ.225 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇండియాలో దీని నెట్ కలెక్షన్ రూ.1140.67 కోట్లు. ఖర్చులు పోను, సినిమాకు రూ.915.67 కోట్ల లాభం వచ్చింది. ఇది బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 406 శాతానికి పైగా ఉంటుంది. నిర్మాతల పంట పండిందని చెప్పొచ్చు.
55
'ధురంధర్ 2' ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది?
`ధురంధర్ 2` ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది చూస్తే, ఇంకా థియేటర్లలో ఆడుతున్న నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మే రెండో వారంగానీ, మూడో వారంలోగానీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్, డానిష్ పండోర్ వంటి నటులు కూడా నటించారు.