Illu Illalu Pillalu Today Episode: భాగ్యం, వల్లికి అడ్డంగా దొరికిపోయిన ధీరజ్, ప్రేమ.. ఇక ఇంట్లో సునామీలే

Published : Jul 17, 2026, 11:18 AM IST

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ధీరజ్, ప్రేమ పెళ్లి విషయం భాగ్యం, వల్లికి తెలిసిపోతుంది. వారి పెళ్లి వీడియో కూడా చేతికి వస్తుంది. దీంతో వల్లి ప్లానింగ్ మొదలవుతుంది. నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

PREV
13
హోటల్ గదికి వెళ్లిన ప్రేమ, ధీరజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ధీరజ్, ప్రేమ కంగారుగా హోటల్ కి వెళ్తారు. తమ పెళ్లి జరిగిన గది తాళాలు తీసుకొని లోపలికి వెళ్తారు. ఆ గదిలో ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తువస్తుంది. పోలీసులు రావడం, పోలీసుల ముందు తాళి కట్టడం అవన్నీ గుర్తుచేసుకొని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. తర్వాత గది నుంచి బయటకు వస్తూ ఏది ఏమీ జరిగినా కూడా ఒకరి చేతిని మరొకరు పట్టుకునే ఉండాలని అనుకుంటారు. అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఇడ్లీ బాబాయ్, భాగ్యం చూస్తారు.

23
భాగ్యం చేతికి ప్రేమ, ధీరజ్ పెళ్లి వీడియో

ఇడ్లీ బాబాయ్, భాగ్యం కలిసి హోటల్ రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్తారు. ప్రేమ, ధీరజ్ పెళ్లి గురించి అడుగుతారు. అయితే రిసెప్షనిస్టు చెప్పేందుకు ఇష్టపడదు. దాంతో 30,000 రూపాయలు లంచం ఇచ్చి మరీ మొత్తం విషయం తెలుసుకుంటారు. కళ్యాణ్ అనేవాడు ప్రేమను తీసుకొచ్చాడని, అయితే లవ్ పేరుతో నమ్మించి వేరే వాళ్ళకి అమ్మేశాడని చెబుతుంది రిసెప్షనిస్ట్. ప్రేమను కాపాడేందుకు ధీరజ్, అతని తల్లి వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నారని వివరిస్తుంది. అప్పుడు భాగ్యం సిసి ఫుటేజ్ ఉంటే కావాలని అడుగుతుంది. అది కూడా ఇచ్చేస్తుంది రిసెప్షనిస్ట్. దీంతో భాగ్యం ఆనంద పడిపోతూ ఉంటుంది.

ఇక ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. వేదవతి.. ధీరజ్, ప్రేమలకు ఏం జరిగిందోనని కంగారుగా ఉంటే.. వల్లి మాత్రం ఆనందంగా ఉంటుంది. ఇక అమూల్యను కూల్ చేసేందుకు విశ్వ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈలోపు రామరాజు వచ్చి అన్నం వడ్డించమని అడుగుతాడు. వేదవతి ప్రేమ, ధీరజ్ అంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడిగితే షాపింగ్ కి వెళ్ళారని చెబుతుంది. ఇంతలో ధీరజ్, ప్రేమ వస్తారు. పోలీసులు ఎందుకు పిలిచారని వేదవతి అడుగుతుంది. వేరే కేసు ఎంక్వయిరీ గురించి అని చెబుతాడు ధీరజ్. అది రామరాజు వినేస్తాడు. కేసు ఏంటని అడిగితే ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అడుగుతున్నారని కవర్ చేస్తాడు ధీరజ్.

33
వల్లికి మొత్తం తెలిసిపోయింది

శ్రీవల్లి వీర లెవెల్లో నటించడం మొదలుపెడుతుంది. మీరు షాపింగ్ కి వెళ్ళారని చెప్పారు కదా షాపులో ఏమీ కొనలేదా? బ్యాగులు ఏవి? అని అడుగుతుంది. ఆమె అడిగే ప్రశ్నలకు ప్రేమ ఏదో సమాధానాలు చెబుతుంది. వేదవతికి కోపం వచ్చి శ్రీవల్లిని ఇక ఆపమని తిడుతుంది. అందరినీ భోజనానికి రమ్మంటుంది వేదవతి. ఇక వల్లికి భాగ్యం ఫోన్ చేస్తుంది. ప్రేమ, ధీరజ్ పెళ్లి విషయాలన్నీ చెప్పేస్తుంది. అంతేకాదు వీడియోను కూడా ఆధారంగా సంపాదించామని చెప్తుంది. అది విని వల్లి ఆనందం పట్టలేదు. ఆ రహస్యాన్ని బయటపెట్టి ఇంట్లో పెద్ద సునామీనే సృష్టించాలని, ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories