ఫ్రస్ట్రేటెడ్ భార్యగా ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి పాత్ర అలరిస్తుంది. ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.