అసలు ఈ విషయంలో ముందుగా తలుచుకోవల్సింది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను. ఈమధ్య ఆయన ఏ డైరెక్టర్ తోనూ సినిమా రిపీట్ చెయ్యడం లేదు. అలా అని స్టార్ డైరెక్టర్లతోనో.. లేకుంటే సేఫ్ డైరెక్టర్లతో సినిమాలు కూడా చెయ్యడం లేదు . అసలు ఎవరి ఊహకీ అందని , కాంబినేషన్స్ ని తెరమీదకి తెస్తున్నారు ప్రభాస్. అందులో ముక్యంగా,,,హీరోయిజానికి కొత్త డెఫినిషన్ చెప్పిన సందీప్ వంగాతో తన 25 వసినిమా అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్ .. ఇంతవరకూ స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యని డైరెక్టర్ మారుతితో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఓ వైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. మరో వైపు అసలు స్టార్ ఇమేజ్ ని ఇంతవరకూ హ్యాండిల్ చెయ్యని మారుతికి అవకాశం ఇచ్చాడు