`ఢీ` అందాల తరంగం దీపికా పిల్లి.. తన ఏజ్‌ రివీల్‌ చేసింది.. బర్త్ డే హంగామా(ఫోటోలు)

First Published Apr 18, 2021, 7:17 PM IST

`ఢీ` అందాల భామ దీపికా పిల్లి తన బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వైభవంగా చేసుకుంది. బర్త్ డే బేబీలా హంగామా చేసిన ఈ బ్యూటీ తన బర్త్ డే డేట్‌ చెప్పేయడం విశేషం. 

`ఢీ` డాన్స్‌ షోలో క్యూట్‌ అందాలతో తన వయ్యారాలు ఒలకబోస్తూ తన ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని పెంచుకుంటున్న దీపికా పిల్లి ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది.
undefined
చాలా గ్రాండియర్‌గా తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకున్నట్టు ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో మరింత క్యూట్‌గా కనిపిస్తుంది దీపికా.
undefined
అయితే ఈ సందర్భంగా తన ఏజ్‌ రివీల్‌ చేసింది. తాన వయసు ఇంకా 22ఏళ్లే అని చెప్పేసింది. అంతేకాదు డేట్‌ ఆఫ్‌ బర్త్ కూడా చెప్పేసింది. ఏప్రిల్‌ 15, 1999లో జన్మించినట్టు నిర్మొహమాటంగా వెల్లడించింది.
undefined
దీంతో తన బర్త్ డేపై, ఏజ్‌పై ఉన్న సస్పెన్స్ ని క్లీయర్‌ చేసిందీ ఢీ అందాల తరంగా దీపికా పిల్లి. దీంతో ఆమె అభిమానులు బర్త్ డే విషెస్‌ తెలియజేశారు.
undefined
అయితే సోషల్‌ మీడియాలో దీపికాకి ఉన్న ఫాలోయింగ్‌ని చూసి కొందరు నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. బర్త్ డే ఫోటోలు పంచుకుంటు కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్, వందల్లో కామెంట్లు రావడం విశేషం.
undefined
ఈ టిక్‌టాక్‌ బ్యూటీకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ని తన బర్త్ డే సందర్భంగా చూపించింది. తన క్రేజ్‌ని చాటుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి బర్త్ డే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
undefined
టిక్‌టాక్‌తో పాపులర్ అయి ఇప్పుడు సినీ అవకాశాలు అందరిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది దీపికా పిల్లి. ఢీ ఛాంపియన్స్ ` షోలో రచ్చ రచ్చ చేస్తుందీ హాట్‌ అందాల భామ. టిక్‌టాక్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. వారి కెరీర్‌ని మలుపుతిప్పింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసింది. అలానే బయటికొచ్చింది అందాల భామ దీపికా పిల్లి.
undefined
ఈ హైదరాబాద్‌ బ్యూటీ టిక్‌టాక్‌లో బ్యూటీఫుల్‌ లుక్స్ తో, క్యూట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో అందరిని ఆకట్టుకుంది. ఆమెలోని చలాకీ మెస్మరైజ్‌ చేసింది. బిగ్‌ ఆఫర్స్ ని కొట్టేసింది.
undefined
అంతకు ముందు మ్యూజికల్‌ డాన్సర్‌గానూ ఆకట్టుకుంది. ఇదే ఈ బ్యూటీకి ఈటీవీలో ఛాన్స్ వరించేలా చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో ఢీ ఛాంపియన్‌లో యాంకర్‌గా మెప్పించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో క్వీన్‌ టీమ్‌కి లీడ్‌గా ఎన్నికైంది. అంతకు ముందు వర్షిణి సౌందరాజన్‌ లీడ్‌ చేయగా, ఆ స్థానాన్ని దీపికా పిల్లి దక్కించుకుంది.
undefined
ఢీ ఛాంపియన్‌ గత వారం ఈ అమ్మడు చేసిన డాన్స్, హడావుడి టాక్‌ ఆఫ్‌ ది షో అయ్యింది. హైపర్‌ ఆదితో కలిసి మత్తెక్కించే డాన్స్ తో కనువిందు చేసింది. షోనే ఓ ఊపు ఊపింది. దీంతో అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇందులో దీపికానే హైలైట్‌ కావడం విశేషం.
undefined
ఈ అమ్మడి అందం ముందు వర్షిణి గ్లామర్‌ డీలా పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు షోలో, మరోవైపు గ్లామరస్‌ ఫోటో షూట్‌లతో నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
undefined
వచ్చిన కొద్ది టైమ్‌లోనే సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. దీంతో ఈ అమ్మడిని అభిమానులు సోషల్‌ మీడియాలో మీమ్స్ చేయడంతోపాటు ట్రెండ్‌ చేస్తున్నారు.
undefined
click me!