డెకరేషన్ చేయడమంటే మాటలు అనుకున్నారా చేస్తే తెలుస్తుంది అంటుంది కావ్య. నేనైతే నిమిషాల మీద చేసే వాడిని కానీ నువ్వు ఏదో ఊడబొడుస్తావు అని అందరూ అనడంతో నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను అయినా ఈ డెకరేషన్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అంటాడు రాజ్. మీలాంటి వాళ్లకి తాగి స్టోర్ రూమ్ లో దూరడమే నచ్చుతుంది కానీ ఇలాంటివి ఎలా నచ్చుతాయి అంటూ ఆట పట్టిస్తుంది కావ్య. జరిగిపోయిన వాటిని గుర్తు చేయకు అంటూ అక్కడినుంచి వచ్చేస్తాడు రాజ్.