కోలీవుడ్ స్టార్ ధనుష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ కాదు, ఓ సినిమా ఉందని తేలిపోయింది. ధనుష్ దర్శకత్వంలో మృణాల్ ఓ పీరియడ్ ఫిల్మ్‌లో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవుండదు.. ఓ హీరో, హీరోయిన్ కలిసి కాఫీ తాగినా చాలు.. వాళ్ల మధ్య ఏదో నడుస్తోందంటూ కథలు అల్లేస్తారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్, సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. ఈక్రమంలో మృణాల్ కూడా ఈ విషయంలో స్పందించింది. ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. కానీ ఈ కథలో ఇప్పుడు ఓ ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.
25
డేటింగ్ రూమర్లపై మృణాల్ ఏమన్నదంటే?
గత కొన్ని రోజులుగా ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ రూమర్లపై మృణాల్ వెంటనే స్పందించింది. "నాకు డేటింగ్, పెళ్లి చేసుకునేంత టైమ్ లేదు. సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్నా" అని ఒకే మాటతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ధనుష్ మాత్రం ఎప్పటిలాగే ఈ విషయంపై సైలెంట్‌గా ఉండిపోయాడు.
35
పుకార్ల వెనుక మాస్టర్ ప్లాన్..
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. వీళ్లిద్దరి మధ్య నడుస్తున్నది ప్రేమ వ్యవహారం కాదట, పూర్తిగా సినిమా వ్యవహారమట! అవును, జాతీయ అవార్డు గ్రహీత అయిన ధనుష్ ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. 'పా పాండి', 'రాయన్' వంటి చిత్రాల తర్వాత ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కోసమే ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశాడట.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ దర్శకత్వంలో రాబోయే ఈ కొత్త సినిమా 1960-70ల నాటి చారిత్రక కథతో తెరకెక్కనుందట. ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యమున్న సినిమా అని, ఇందులో మృణాల్ ఠాకూర్ ఓ శక్తివంతమైన 'దేవత' పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, తన సొంత నిర్మాణ సంస్థ 'వండర్‌బార్ ఫిల్మ్స్' బ్యానర్‌పైనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనుండటం మరో విశేషం. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.
55
ఇద్దరూ ఫుల్ బిజీ..
ప్రస్తుతం ధనుష్ చేతిలో 8-9 సినిమాలు ఉన్నాయి. నటన, దర్శకత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ, షూటింగ్ గ్యాప్‌లో ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అటు మృణాల్ కూడా తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.మొత్తానికి, "మేమిద్దరం డేటింగ్ చెయ్యట్లేదు" అని మృణాల్ క్లారిటీ ఇచ్చినా, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. ఒక టాలెంటెడ్ డైరెక్టర్, అద్భుతమైన నటి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి!