ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'రామాయణ'లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఒకప్పుడు కేవలం ఒక్క రోజు సెలవు కోసం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇంతకీ అసలేం జరిగిందంటే..
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది స్టార్ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఇంతటి స్టార్‌డమ్ ఉన్న సాయి పల్లవి, ఒకానొక టైంలో ఒక్క రోజు సెలవు కోసం ఏడ్చేసిన సందర్భం ఉందంటే నమ్ముతారా? ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
23
ఒక్క రోజు కూడా బ్రేక్ లేదని ఏడ్చేశా..
ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ, "సాధారణంగా నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. కానీ, కోవిడ్ తర్వాత అనుకోకుండా ఒకేసారి మూడు సినిమాలకు పనిచేయాల్సి వచ్చింది. ఆ మూడు సినిమాల షూటింగ్స్ మధ్య నాకు అస్సలు గ్యాప్ దొరకలేదు. కంటిన్యూగా పనిచేయడం నాకు అలవాటు లేదు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్క రోజు కూడా సెలవు దొరకడం లేదని ఏడుపొచ్చేసింది. కానీ ఈ విషయం గురించి ఏ నిర్మాతకు గానీ, దర్శకుడికి గానీ చెప్పలేదు. ఎందుకంటే నా వల్ల ఏ సినిమాకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు.
33
ఏకంగా 10 రోజుల సెలవులు
సాయి పల్లవి మాట్లాడుతూ.. "అయితే, నేను ఏడుస్తుండటం నా చెల్లెలు చూసింది. తను వెంటనే నా సినిమాల నిర్మాతలకు ఈ విషయం చెప్పింది. దాంతో వాళ్లు నాకు ఏకంగా 10 రోజుల సెలవు ఇచ్చారు. ఒక్క రోజు బ్రేక్ కావాలని ఏడ్చిన నాకు, ఒకేసారి పది రోజులు సెలవులు దొరకడంతో వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. నా లైఫ్‌లో అలా జరగడం అదే మొదటిసారి, చివరిసారి. కోవిడ్ వల్ల అనుకోకుండా అలా జరిగింది అంతే" అని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.