సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు ధనుష్. హీరోగా మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయితగా మల్టీ టాలెంట్ చూపిస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ తో కొనసాగుతున్నారు. అంతే కాదు ధనుష్ తనతో పాటు ఎంతో మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చాడు.
తన సినిమాల ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, హీరో శివ కార్తికేయన్ వంటి ఎంతో మంది టాలెంట్ ఉన్నవారిని పరిచయం చేశారు ధనుష్. ఇక ప్రొడ్యూసర్ గా కూడా ధనుష్ ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. ఆ జాబితాలో నానుమ్ రౌడీ ధాన్ కూడా ఒకటి.