హిట్ కొట్టేటట్లుందే : ధనుష్ ‘రాయాన్’ స్టోరీ , సినాప్సిస్..

First Published Jul 24, 2024, 6:19 PM IST

2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమాతో విజయం సాధించేలా కనిపిస్తున్నారు.  

Raayan

ధనుష్ కు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ సార్ వంటి స్ట్రైయిట్ సినిమాలు చేసి హిట్ కొట్టారు. దాంతో ఆయన కొత్త చిత్రం వస్తోందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో ధనుష్ తాజా చిత్రం ‘రాయాన్’ఇక్కడ సినీ లవర్స్ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  ‘రాయన్’ జూలై 26న విడుదల కానుంది. సినిమా క్వాలిటీ ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కోసం సినిమా సినాప్సిస్ చూద్దాం.

Actor Dhanush Raayan

ధనుష్ మొదటి నుంచి  విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. గుంపులో గోవిందంలాగ కాకుండా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే కథ నచ్చితే చాలు హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ధనుష్ తన 50వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాయన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Latest Videos


Raayan

ఈ సినిమాకు  తానే స్వయంగా దర్శకత్వం వహించటం విశేషం. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్నది. ధనుష్ కెరీర్ లో రాయన్ 50వ చిత్రంగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. 
 

ఈ సినిమాలో  ధనుష్ పోలీస్ ఇన్ఫార్మర్ గా కనిపించనున్నారు. సెన్సార్ కు సబ్మిట్ చేసిన సినాప్సిస్ ప్రకారం రాయాన్... వైలెంట్ గా ఉండే కొన్ని గ్యాంగ్ ల నుంచి తనను  తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఓ సాధారణ వ్యక్తి చేసే పోరాటమే సినిమా అంటున్నారు. కొన్ని అసాధారణ  పరిస్దితులు సాధారణమైన రాయన్ ని పెద్ద క్రైమ్ ప్రపంచంలోకి లాగుతాయి.తన ప్రమేయం లేకుండా వచ్చిన పడిన రాయన్ అక్కడ పరిస్దితులను ఎలా తట్టుకున్నాడేదే కథ.  ఈ సినిమా రన్ టైమ్ 145:12 నిముషాలు.

 చిత్రానికి సంబంధించి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. సెన్సార్ టీమ్ సభ్యులు చిన్న చిన్న కట్స్ తో ఈ చిత్రానికి “A” సర్టిఫికెట్ జారీ చేశారు. రాయన్ లో హింసను ప్రేరేపించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, రక్తం, ఘర్షణలు వంటి దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో కొన్నిటిని తొలగించాలని సూచనలు చేసారు. కాగా A సర్టిఫికెట్ పొందిన కారణంగా 18లోపు వయసు గల వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం నిషేధం. 
 

 రాయన్ ను సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 50వ సినిమా కాబట్టి ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి ‘రాయన్ ‘లో నటించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.   2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమాతో విజయం సాధించేలా కనిపిస్తున్నారు.  

click me!