ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్, ఒక్కటి మాత్రమే బంపర్ హిట్.. మణిశర్మ ప్రాణం పెట్టేశారు

Published : Jul 24, 2024, 05:07 PM IST

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన 2001లో జరిగింది. 

PREV
16
ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్, ఒక్కటి మాత్రమే బంపర్ హిట్.. మణిశర్మ ప్రాణం పెట్టేశారు

 

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన 2001లో జరిగింది. ఆ ఏడాది సంక్రాంతికి ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. 

 

26

 

నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఈ పోటీలో విజేతగా నిలిచింది బాలకృష్ణ. మృగరాజు చిత్రం డిజాస్టర్ కాగా దేవి పుత్రుడు యావరేజ్ గా నిలిచింది. 

 

36

ఈ మూడు చిత్రాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు తరాలకు సంగీత దర్శకుడు ఒకరే. ఆయనే స్వరబ్రహ్మ మణిశర్మ. మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించిన చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం.. ఆ మూడు చిత్రాలు స్టార్ హీరోలవే కావడం అరుదైన సంఘటన. 

46

నరసింహ నాయుడు చిత్రానికి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మిగిలిన రెండు చిత్రాలకు కూడా మణిశర్మ నరసింహ నాయుడు చిత్రానికి తీసిపోని సాంగ్స్ ఇచ్చారు. మృగరాజు చిత్రంలో మణిశర్మ.. చిరంజీవి చేత పాట కూడా పాడించారు. 

56

కానీ ఆ మూవీ బాగా లేకపోవడంతో వర్కౌట్ కాలేదు. మృగరాజు, నరసింహ నాయుడు చిత్రాలు జనవరి 11న రిలీజ్ అయ్యాయి. దేవి పుత్రుడు జనవరి 14న రిలీజ్ అయింది. దేవి పుత్రుడు చిత్రంలో సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. 

66

మణిశర్మ ఈ మూడు చిత్రాల కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రాణం పెట్టి మ్యూజిక్ అందించారు. ఆ సమయంలో ఈ మూడు చిత్రాల ఆడియో క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. మృగరాజు చిత్రానికి అయితే ఒక రేంజ్ లో హైప్ ఉండేది. కానీ ఆ మూవీ నిరాశపరిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories