పవన్‌ తో మొదటిసారి ఆ అనుభవం.. స్టార్‌ హీరోలే ఆ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు.. అనసూయ సంచలన స్టేట్‌మెంట్‌

Published : Jul 24, 2024, 05:10 PM IST

పవన్‌ కళ్యాణ్‌తో ఐటెమ్‌ సాంగ్‌ పై ఓపెన్‌ అయ్యింది అనసూయ. అంతేకాదు స్టార్‌ హీరోలపై ఆమె సంచలన కామెంట్స్ చేసింది. కొత్త దుమారం రేపుతుంది.   

PREV
16
పవన్‌ తో మొదటిసారి ఆ అనుభవం.. స్టార్‌ హీరోలే ఆ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు.. అనసూయ సంచలన స్టేట్‌మెంట్‌

అనసూయ బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌. అదే సమయంలో మంచి టాలెంటెడ్‌ కూడా. ఆమె అందంతో ఆకట్టుకోవడమే కాదు, అభినయంతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది.  ఏ సినిమా చేసినా అద్భుతమైన నటనతో అదరగొట్టింది. `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్ర నుంచి అనసూయ నటిగా ది బెస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె నటన అందరిచేత మాట్లాడుకునేలా చేస్తుంది. 

26

మరోవైపు అనసూయ చుట్టూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆమె స్పందించే తీరు వివాదంగా మారుతుంటుంది. ఆమె సామాజిక విషయాలపై స్పందించినా వివాదంగా మారుతుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతుంది. తాజాగా ఆమె మరోసారి స్టార్‌ హీరోలను గెలికింది. వారిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దౌర్భాగ్య పనులు చేస్తున్నారంటూ హాట్‌ కామెంట్‌ చేసింది. 

36

`సింబా` ఈవెంట్‌లో అనసూయకి ఓ ప్రశ్న ఎదురైంది. సందేశాలకు సంబంధించి సినిమాల్లో చూపించడం వేరు, రియల్‌ లైఫ్‌లో దాన్ని పాటించడం వేరు. అది ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యమవుతుందనే ప్రశ్న, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి డ్రగ్స్ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రశ్నలకు అనసూయ స్పందిస్తూ, సినిమా సెలబ్రిటీలు చెబితే జనాలకు ఎక్కువగా వెళ్తుంది అంటుంటారు. అదే ఉద్దేశ్యంతో తమ వంతుగా ప్రకృతి గురించి చెబుతున్నామని తెలిపింది అనసూయ. వినేంత వరకు మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటామని వెల్లడించింది. 
 

46

ఈ సందర్భంగా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు డ్రగ్ అబ్యూస్‌, అమ్మాయిలను టీజ్‌ చేయడమనేది సినిమాల్లో విలన్లు చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలే చేస్తున్నారు. అది ధౌర్బాగ్యం. అబ్బాయిలు కూడా అరేయ్‌ ఇలా కొట్టేసి, సిగరేట్లు తాగి, డ్రగ్స్ తీసుకుని తోపు లాగా ఉంటేనే అమ్మాయిలు పడుతున్నారని అనుకుంటున్నారు. అమ్మాయిలేమో అలాంటి వాళ్లకే పడాలనుకోవడం అనేది ఎక్కువగా చూపిస్తున్నారని తెలిపింది అనసూయ. సినిమా చాలా పవర్‌ఫుల్‌ మీడియం. ఒక మదర్‌గా నేను సమాజం విషయంలో చాలా కేర్‌గా, కాన్సియస్‌గా ఉంటాను అని చె

56

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌తో సాంగ్‌ చేయడంపై స్పందించింది. `హరి హర వీరమల్లు` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిందట అనసూయ. దీనిపై ఆమె స్పందిస్తూ, ఒకప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ల వల్లే తనని ట్రోల్‌ చేసే ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని, దర్శకుడు తనకు మంచి స్నేహితుడు అని, సినిమాటిక్‌ వర్క్ ఆయనతోనే ప్రారంభించాను. ఆయన ఇలా సాంగ్‌ ఉందని చెప్పారు. చాలా మంది పాట. ఆసాంగ్‌ రిలీజ్‌ అవుతుందనుకునే టైమ్‌కి పవన్‌ గారు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన లైఫే మారిపోయింది.

66

పవన్‌ కళ్యాణ్‌తో ఆ సాంగ్ చేయడం, ఆయనతో ఉండటం, ఆయనతో టైమ్‌ స్పెండ్‌ చేయడం గొప్ప, మంచి మెమొరీగా భావిస్తున్నా` అని తెలిపింది అనసూయ. ఇదిలా ఉంటే `అత్తారింటికి దారేదీ`లో సాంగ్‌లో చేసేందుకు నో చెప్పిన అనసూయ, ఇప్పుడు `హరిహర వీరమల్లు`లో చేసి ఆ లోటుని భర్తీ చేసుకుంది. కానీ ఈ పాట ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories