ధనుష్ ‘రాయాన్’తెలుగు వెర్షన్ కలెక్షన్స్..అంత దారుణమా?

Published : Jul 28, 2024, 10:13 AM IST

 2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమా కూడా తెలుగులో అదే దారిలో

PREV
18
 ధనుష్ ‘రాయాన్’తెలుగు వెర్షన్ కలెక్షన్స్..అంత దారుణమా?
Raayan Trailer


చాలా కాలంగా ధనుష్ కు తెలుగు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి ట్రై చేస్తున్నాడు. రఘువరన్ బీటెక్, తిరు, సార్ వంటి సినిమాలు అప్పుడప్పుడు బాగా వర్కవుట్ అయినా  మార్కెట్ అనుకున్న స్దాయిలో పెరగటం లేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల చిత్రంలో కూడా చేస్తున్నారు. అయితే  ఆయన కొత్త చిత్రం వస్తోందంటే  ఇక్కడ కూడా బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో ధనుష్ తాజా చిత్రం ‘రాయాన్’ఇక్కడ సినీ లవర్స్ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  ‘రాయన్’ జూలై 26న విడుదల  అయ్యింది.  అయితే అనుకున్న స్దాయిలో తెలుగులో కలెక్షన్స్ తెచ్చుకోలేకపోతోంది.
 

28


ధనుష్ మొదటి నుంచి  విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. గుంపులో గోవిందంలాగ కాకుండా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే కథ నచ్చితే చాలు హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ తన 50వ చిత్రం గా తనే రాసి, డైరక్ట్ చేసి నటించారు.  తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రిలీజైంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా వచ్చింది.  ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లు సినిమాలేదు.
 

38
Actor Dhanushs Raayan


  2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమా కూడా తెలుగులో అదే దారిలో ప్రయాణం పెట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో ఓపినింగ్స్ రాలేదు. ట్రేడ్ నుంచి చెప్తున్న లెక్కలు ప్రకారం కేవలం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటిన్నర మాత్రమే గ్రాస్ వచ్చింది. ఇది ఇలాంటి పెద్ద సినిమాకు దారుణమైన ఓపినింగ్స్ అని చెప్పాలి.

48
Raayan


ఈ సినిమాకు హైదరాబాద్ వచ్చి మరీ ధనుష్ ప్రమోట్ చేసినా బజ్ క్రియేట్ కాలేదు. అందుకు కారణం సినిమా పూర్తిగా తమిళ ప్లేవర్ తో అక్కడ నేటివిటితో ఉండటమే. ఈ గ్యాంగస్టర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250 థియేటర్స్ దాకా రిలీజైంది. అయితే హౌస్ ఫుల్స్ అయిన థియేటర్స్ అతి తక్కువ. చాలా చోట్ల ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఆక్యుపెన్సీ నమోదైంది. బెస్ట్ థియేటర్స్ ఉన్నా, పోటీగా వేరే సినిమాలు లేకున్నా, తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ సినిమాపై అసలు ఆసక్తి చూపలేదు.

58
Actor Dhanushs


తెలుగులో ఆరు కోట్లు దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కాదు కదా అందులో సగమైనా వస్తుందని నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే శని వారం కూడా పెద్దగా థియేటర్స్ దగ్గర జనం కనపడలేదు. యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఉన్నంతలో జనం కల్కి సినిమాకే వెళ్తున్నారు. 

68
Actor Dhanushs


 రాయన్ ను సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 50వ సినిమా కాబట్టి ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి ‘రాయన్ ‘లో నటించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 

78
Raayan


స్టోరీ లైన్

కార్తవ రాయన్(ధనుష్) కు తన  తమ్ముళ్లు ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్), తన చెల్లి దుర్గ(దుషారా విజయన్) అంటే ప్రాణం. కానీ చిన్నప్పుడే తల్లి,తండ్రి తమను వదిలేసి వెళ్లిపోవటంతో వాళ్ల భాద్యతను తనే తీసుకుంటాడు. వాళ్లపై ఈగ వాలినా కూడా సహించడు.  ఈ క్రమంలో  రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి నడుపుకుంటూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. అయితే ముత్తువేల్ మాత్రం కాస్త తేడా. ఎప్పుడూ  ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ తగువులు తెస్తూ  ఉంటాడు. 


 

88
Raayan

ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(SJ సూర్య)లు  ఇద్దరు లోకల్ గ్యాంగస్టర్. తమ గ్యాంగ్ లతో వీరవిహారం చేస్తూంటారు. అలాగే అదే ఊరికి ఈ గ్యాంగ్ ల అంతు చూడటానికి  పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్)  వస్తాడు. అతను వీళ్లను అంతం చేయాలనుకోవటానికి వేరే కథ ఉంటుంది. ఇలా ఎవరిపనిలో వాళ్లు ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అనుకొనే   సీతారాం (ఎస్‌జే సూర్య)తో చేతుల కలిపిన ముత్తు, మాణిక్యం తన అన్నయ్య రాయన్‌పై హత్యా ప్రయత్నం చేస్తారు. అలా ఎందుకు చేసారు. అప్పుడు తన ప్రాణంగా భావించే తమ్ముళ్లే శత్రువులు అయితే రాయన్ ఎలా స్పందించాడు. ఈ లోగా చెల్లి వైపు కథ మలుపు తిరుగుతుంది. అదేమిటి వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

click me!

Recommended Stories