ఈరోజు ఎపిసోడ్ లు ఆదిత్య(adithya)తన మేనత్తను తన ఇంట్లో నుంచి బయటకు గెంటేసినందుకు భాష సంతోషంగా ఫీల్ అవుతూ ఆదిత్య ని పొగుడుతాడు. అప్పుడు ఆదిత్య అలా ఏమీ లేదు పెద్దవాళ్ళు అన్న తర్వాత మంచి సలహాలు ఇవ్వాలి కానీ ఇలాంటి సలహాలు ఇస్తే నేను ఇలాగే చేస్తాను అని అనడంతో వెంటనే కమల(kamala) నా చెల్లి చనిపోయి ఎక్కడ ఉందో కానీ ఇవన్నీ చూస్తే కానీ చాలా సంతోషపడుతుంది అని అంటుంది.
అప్పుడు ఆదిత్య మీ చెల్లి చనిపోలేదు బతికే ఉంది అనుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక మరొకవైపు ఆదిత్య కోసం రాధ (radha)ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు రాద మాట్లాడుతూ నేను మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా విను పెనిమిటి ఇవి నా మనసులో నుంచి వస్తున్న మాటలు మన బిడ్డ దేవి (devi) చిన్నప్పటి కెళ్ళి సంధి మాధవ్ సార్ ని నైనా అని పిలుస్తోంది.
మీరు కనిపించిన తరువాత కూడా అలాగే పిలుస్తూ ఉండటంతో నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది రాధ (radha)మీరు ఇదే ఊర్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత కొంతకాలం పాటు నేను మీకు కనిపించకుండా తిరిగాను. అప్పుడు నేను బాధపడుతూ నాలో నేనే కుమిలిపోతూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాను అంటూ ఎమోషనల్ అవుతుంది.
అప్పుడు ఆదిత్య(adithya) ఏమీ కాదు దేవికి ఇప్పటినుంచి చెబుతూ పోతే అర్థమవుతుంది తాను ఇంకా చిన్న పిల్లనే అని రాధ కు ధైర్యం చెబుతాడు. ఇంతలో అక్కడికి మాధవ వచ్చి ఇలా పబ్లిక్ గా ఆదిత్యను కలిస్తే నిన్ను ఊరి జనాలు తప్పుగా అనుకుంటారు అని చెప్పి రాధ(radha) ని తన కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అప్పుడు రాధామాధవ పై కోపంతో రగిలి పోతూఉంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ రుక్మిణి కోసం ఉపవాసం దీక్షను మొదలుపెడుతుంది.
రుక్మిణి వెతకడం కోసం బయలుదేరుతుండగా కమల శుభ శకునంలా ఎదురు రావడంతో దేవుడమ్మ(devudamma)ఆనందంగా ఫీల్ అవుతూ తాను ఎందుకు వెళ్తున్నానో అన్న సంగతి వారికి చెప్పడంతో వారు సత్య,కమల(kamala),భాష ముగ్గురు షాక్ అవుతారు. కమల,భాష లు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరివైపు మరొకరు చూసుకుంటూ ఉంటారు.
మరొక వైపు భాగ్యమ్మ (bhagyamma)దేవిని చూడటం కోసం స్కూలుకి వస్తుంది. ఆమె అనుకున్న విధంగా దేవి ఇంతలోనే అక్కడికి రావడంతో సంతోష పడుతూ దేవి(devi) కోసం జామపండ్లను ఇస్తుంది. అది చూసిన రాధ సంతోషపడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దేవి ఆదిత్య తో స్కూల్ లో కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మాధవా వచ్చి దేవి అని పిలవడంతో అప్పుడు దేవి మా నాన్న వచ్చిండు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దాంతో ఆదిత్య బాధ గా ఫీల్ అవుతాడు.