ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో దేవుడమ్మ భర్త దేవుడమ్మతో ఇక నువ్వు ఆలోచించాల్సింది కనిపించని రుక్మిణి గురించి తన బిడ్డ గురించి కాదు మన బిడ్డను నమ్ముకున్న సత్యా గురించి అని దేవుడమ్మతో చెబుతాడు. అమెరికా వెళ్ళలేకపోయాను అని సత్య బాధపడుతుంటే నువ్వు వారిని మందలించకుండా రుక్మిణి, రుక్మిణి బిడ్డ గురించి ఆలోచిస్తే ఎలా దేవుడమ్మ అని అనగా దానికి దేవుడమ్మ నిజమేనండి రుక్మిణి గురించి ఆలోచిస్తూ సత్య గురించి మర్చిపోతున్నాను అంటుంది. అప్పుడు దేవుడమ్మ భర్త రుక్మిణి ఎక్కడున్నా వెతికిద్దాం ఇంటికి తీసుకొద్దాం ఈ లోగా సత్య గురించి ఆలోచించు తనను దగ్గరకు తీసుకొని ఓదార్చు అనగా దానికి దేవుడమ్మ నవ్వుతూ అలాగేనండి అంటుంది.