Devatha: ఆదిత్యను సహాయం కోరిన దేవి.. రాధకు వార్నింగ్ ఇచ్చిన మాధవ!

First Published Sep 29, 2022, 11:48 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జానకమ్మ రుక్మిణి, ఆదిత్య  పెళ్లి ఫోటో చూస్తూ, ఎంత గొప్ప ఇంట్లో కోడలుగా హాయిగా బతకాల్సిన దానివమ్మా ఇలాగా పరాయి ఇంట్లోకి వచ్చి బతకాల్సి వస్తుంది. అలాగా వచ్చినా నీకు ఇంట్లో రక్షణ లేకుండా పోయింది. ఏ సంబంధం లేకపోయినా కూతుర్ని పెంచినందుకు నీ మీద రుణం కూడా లేకుండా పరాయి వాడి భార్య వి అని తెలిసినా కూడా నీ మీద మనసు పడ్డాడు. ఇప్పుడు నేను నేను మా ఆయనకు ఈ విషయం చెప్పినా, ఆయనకు కూడా ప్రమాదం ఉంటుంది,ఇలాగే జరుగుతుందా అని భయపడుతూ ఉంటుంది జానకమ్మ.
 

 ఆ తర్వాత సీన్లో ఆదిత్య ఇంటికి వస్తాడు. అప్పుడు సత్య,నేను హాస్పిటల్ కి వెళ్లి వచ్చాను ఆదిత్య అని అనగా,మొన్న దేవిని తిట్టావు ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టడానికి వెళ్ళావా అని అడుగుతాడు ఆదిత్య. లేదు ఆదిత్య నేను దేవి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగాను ఇంటికి కూడా రమ్మన్నాను ముందు భయపడ్డాది కానీ తర్వాత తను బానే మాట్లాడింది అని అనగా ఆదిత్య ఆనందపడి,సత్య నిజంగానే అక్కడికి వెళ్ళావా? దేవితో మాట్లాడావా? నువ్వు చెప్తే దేవి కచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు దేవి ఇంటికి రాదేమో అని భయపడ్డాను థాంక్స్ సత్య అని చెప్పి వెళ్ళిపోతాడు.
 

దేవుడమ్మ దీన్ని చూస్తూ, నువ్వు తెలియకుండానే తప్పు చేస్తున్నావు ఆదిత్య. నీ భార్యకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వేరే వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తే నీ భార్య బాధపడుతుంది అని అనుకుంటుంది దేవుడమ్మ.ఆ తర్వాత సీన్లో జానకమ్మ దగ్గరికి మాధవ్ వచ్చి, చూసావా అమ్మ నీకు ఏ గతి పట్టిందో. నేను ముందే చెప్పాను నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని.కానీ నువ్వు నా మాట వింటేనే కదా. నన్ను రాదను విడగొట్టడానికి చూసిన వాళ్ళు ఎవరిని వదలను అని అంటాడు. ఇంతలో దేవీ,రుక్మిణిలు అక్కడికి వస్తారు. అప్పుడు మాధవ్ తన ముఖాన్ని మార్చి ఏడుస్తున్నట్లు నటిస్తాడు.
 

 అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి, చూశావా నానమ్మ నాన్న నిన్ను చూసి ఎంత బాధ పడుతున్నారో! అయినా నువ్వు మెట్లు మీద నుంచి కింద ఎలా పడిపోయావు అని అనగా జానకమ్మ తన చేతిని మాధవ్ వైపు చూపిస్తుంది. అప్పుడు మాధవ్ భయపడతాడు కానీ దేవి మాత్రం, చూశావా నాయన నానమ్మ,నిన్ను తన దగ్గరే ఉండమని చెప్తుంది అని అంటుంది. అప్పుడు మాధవ్ జానకమ్మ చేయి పట్టుకొని, అమ్మ నేను అంటే నీకు ఎంత ఇష్టం?నువ్వు త్వరగా కోలుకోవాలి అమ్మ అని బాధను నటిస్తాడు. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది.
 

అప్పుడు చిన్మయి ఈ దేవితో, దేవి నువ్వు ఆఫీసర్ సార్ దగ్గరకి వెళ్లి కనుక్కొని నానమ్మకి మంచి హాస్పిటల్ ని ఏదైనా చెప్పమని అడగొచ్చు కదా! నువ్వు అడిగావంటే ఆఫీసర్ కాదన్నారు అని అంటుంది.అప్పుడు మాధవ్ మనసులో ఇప్పుడు అమ్మకు మాట వస్తే నా జీవితం పాడైపోతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో ఆదిత్య కూర్చుని, సత్యన్ని కాఫీ కావాలి అని అడుగుతాడు. అప్పుడు దేవుడమ్మ చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉండడానికి సమయం దొరికినట్టు ఉన్నది అని అంటుంది. ఇంతలో దేవి వస్తుంది ఆదిత్య వెంటనే దేవి దగ్గరికి వెళ్లి హద్దుకుంటాడు.
 

 నువ్వు ఇంక ఇక్కడికి రావు అనుకున్నానమ్మా వచ్చినందుకు థాంక్స్ అని ఆదిత్య అనగా,సత్య పిన్ని నాకు అమ్మ లాంటిది కదా ఆఫీసర్ సారు. అమ్మ తిడితే మాట్లాడడం మానేస్తాను అని అంటుంది దేవి. అప్పుడు సత్య మనసులో, నన్ను అదిత్యని కలుపుతానని చెప్పి మళ్ళీ అక్క ఎందుకు దేవిని పంపించింది అని అనుకుంటుంది. అంతలో దేవుడమ్మ దేవితో,నాతో మాట్లాడొద్దు అని అంటుంది.అప్పుడు దేవి, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ లు కూడా తీసుకున్నాను కదా నేను, సారీ కూడా చెప్పాను అని అనగా, నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే నన్ను పలకరించలేదు కదా అని అంటుంది దేవుడమ్మ.
 

అప్పుడు దేవి దేవుడమ్మ బుగ్గ మీద ముద్దు పెడుతుంది అప్పుడు దేవుడమ్మ కరిగిపోతుంది. సరే కానీ ఎందుకు వచ్చావు అని అడగగా, మా అమ్మ నాన్న ఇక్కడికి పంపించింది. మా నానమ్మకి బాలేదు కదా దానికోసం మీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పింది అని అంటుంది దేవి. సరే అయితే రా అని దేవిని తీసుకువెళ్తాడు ఆదిత్య.అప్పుడు సత్య కాఫీ ఇస్తాను ఆగు ఆదిత్య అని అనగా, ఇప్పుడు వద్దులే సత్య వచ్చి తాగుతాను అని అంటాడు ఆదిత్య. సత్య బాధపడుతుంది ఆ తర్వాత సీన్లో రుక్మిణి వంటగదిలో ఉండగా మాధవ్ అక్కడికి వస్తాడు.
 

నువ్వు ఆఫీసర్ సార్, అమ్మకి నయం కావాలని గట్టిగా కోరుకుంటున్నట్టు ఉన్నారు కదా అని అనగా, మనుషులు ఎవరైనా అలాగే కోరుకుంటారు అని రుక్మిణి అంటుంది. అప్పుడు మాధవ్, మీ ప్రయత్నాలు మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో చిన్మయి జానకమ్మకు కథలు చెబుతూ ఉంటుంది. ఇంతలో రాధ అక్కడికి వచ్చి నువ్వెళ్ళు చదువుకో బిడ్డ నేను నానమ్మకు జావ తాగిస్తాను అని జానకమ్మకు జావ తాగిపిస్తుంది రుక్మిణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!