అసలు నువ్వు ఎవరు ధరణి.. నువ్వు నా కోడలువి.. ది గ్రేట్ దేవయాని కోడలివి.. నువ్వెలా ఉండాలి నాలా దర్జాగా ఉండాలి అంటూ ధరణికి నూరిపొస్తుంది. అతర్వాత దేవయాని కాఫీ కలిపితే అయ్యో అత్తయ్య గారు కాఫీ నేను కలుపుతాను కదా మీరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి అని ధరణి అంటే.. ఇదే చెప్పేది.. ఎదుటి వాళ్ళని చూసి అర్ధం చేసుకోవాలి అని అంటుంది. అతర్వాత కాఫీ తీసుకోని దేవాయని రిషీ గదికి వస్తుంది.. అక్కడ వసుధార, రిషిని కలిసి రొమాంటిక్ గా మాట్లాడుకోవడం చూసి దేవాయని షాక్ అవుతుంది. అక్కడ రిషీకి దేవాయని కాఫీ ఇస్తే ఆ కాఫీ ఎక్కడ రిషీ వసుధారకు సగం ఇస్తాడు ఏమోనని వసుదారకు ఇంకో కాఫీ తెప్పిస్తాలే అని చెబుతుంది. కానీ వసుధార మాత్రం రిషీ కాఫీ షేర్ చేసేలా చేస్తుంది. దేవాయని ముందే ఇద్దరు కాఫీ షేర్ చేసుకుంటారు.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..