కొడుకు పెళ్లి అనగానే సంబరపడిపోయి ఉంటారు ఆనందానికి ఆకాశమే హద్దయి ఉంటుంది కదా కానీ జగతి నువ్వు మహేంద్ర ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రిషి మీ కొడుకే అయినప్పటికీ నా మాటే రిషికి వేదం, గౌరవం, నా మాట జవ దాటలేడు, జవ దాటానివ్వను కూడా అని అంటుంది దేవయాని. అప్పుడు జగతి మాట్లాడుతూ దేవయానికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అప్పుడు దేవయాని నా ఇష్టం లేకుండా నా అనుమతి లేకుండా రిషి వసుధార ల పెళ్లి జరుగుతుందని ఎలా అనుకున్నావు అని అంటుంది. వారిద్దరి పెళ్లి జరగదు.