Karthika Deepam: దీపపై సీరియస్ అయిన కార్తీక్.. చారుశీలని కలుసుకున్న సౌందర్య?

First Published Dec 19, 2022, 8:04 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 19 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో చారుశీల ఎవరి కోసం అయితే నిజం దాస్తున్నావో వాళ్ళు ఎవరూ ఆనందంగా లేరు కార్తీక్. అందరిలో ఒకటే బాధ అనగా నిజం చెప్తే బాధ పోతుందా చారుశీల అసలు ఆ నిజాన్ని నాలోనే దాస్తూ అటు లోపల నన్నే దహించేస్తుంటే లోపల నీ అంత బాధ పడుతున్నానో నీకు తెలియదు అనగా తెలుసు కార్తీక్ పరాయిదాన్ని అయిన నేనే నిన్ను చూసి ఇంత బాధపడుతుంటే ప్రత్యక్షంగా ఆ బాధను అనుభవిస్తున్న మీకు ఎలా ఉంటుందో ఊహించగలను అని అంటుంది చారుశీల. కానీ ఇలా మాత్రం ఉండకూడదు కార్తీక్ ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏ పరిష్కారం లేదా అనగా తెలియదు, పరిష్కారం ఏదైనా కానీ సమస్యను తొలగించేలా ఉండాలి సమస్య, కానీ సమస్యకు పరిష్కారం ఇంకొక సమస్య అవుతుంటే ఏం ఆలోచించగలను అని బాధగా మాట్లాడడంతో చారుశీల కార్తీక్ ని ఓదారుస్తుంది.
 

 మేము బతికే ఉన్నామని మా వాళ్లకు పూర్తిగా తెలియదు కేవలం నమ్మకం మాత్రమే ఇలాంటి సమయంలో మళ్లీ మా వాళ్లకు దగ్గర ఈ దీప పరిస్థితి తెలిస్తే వాళ్ళు ఏమవుతారు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. ఇక దీప విషయానికొస్తే ఆ గుండె నిజం చెప్తే తట్టుకోగలదు అన్న పరిస్థితికి వస్తే నేను నిజం చెప్పేస్తాను అని అంటాడు కార్తీక్. మరొకవైపు దీప బాధ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి పండరి వస్తుంది. ఏడవకు దీపమ్మ అనగా నాకు ఏడుపు కాక ఇంకేం మిగిలింది పండరి చూసావు కదా పొద్దున నువ్వు చూసినప్పుడు ఉన్నవాళ్లు సాయంత్రానికి లేరు అని బాధపడుతూ ఉంటుంది దీప.

అప్పుడు దీప బాధపడుతూ ఉండగా పండరి ఓదారుస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ మేము ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో ప్రతి కదలిక వాళ్ళకి తెలుసు అని దీప బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు అదిగో సారు కూడా వచ్చారు నేను వంట చేసి రెడీగా పెట్టాను మీరిద్దరూ తినండి అని చెప్పగా టాబ్లెట్స్ వేసుకోలేదు అంటే నేను వేయిస్తాను అని అంటాడు. అప్పుడు కార్తీక్ దీపను ఎలా అయినా టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలి అని పండరీ గురించి టాపిక్ తీసినప్పటికీ దీప మాత్రం ఆ విషయం గురించి అడుగుతూ బాధపడుతూ ఉంటుంది.
 

అప్పుడు కార్తీక్ దీపకి ఎలా అయినా నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య హాస్పిటల్లో జరిగిన విషయాలు తలుచుకొని చిన్న పిల్లవైన తల్లిదండ్రుల కోసం ఎంత ఆరాటపడుతున్నావు అని అనుకుంటూ ఉంటుంది. ఇటు కన్నతల్లి బాధ అటు కన్నా బిడ్డ ఆవేదన ఇన్నాళ్ళైనా ఆ విషయాలు వాళ్ళకు చేయకుండా ఉన్నాయా అని బాధపడుతూ ఉంటుంది సౌందర్య. సౌందర్య దగ్గరికి వెళ్లి అసలు శౌర్యకి ఆ అనుమానం ఎందుకు వచ్చింది. ఎలా వచ్చింది అన్న విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి డ్రైవర్ అంజి వస్తాడు. అప్పుడు తొందరగా కారు తీయి మనం ఒక చోటుకు వెళ్లాలి అని సౌర్య దగ్గరికి బయలుదేరుతుంది సౌందర్య.
 

మరొకవైపు కార్తీక్ ఒడిలో దీప తల పెట్టుకొని బాధపడుతూ ఉండగా కార్తీక్ ఓదారుస్తూ ఉంటాడు. పండరి చెప్పింది విన్నావు కదా దీప వాళ్ళు మనకు బిడ్డను ఇవ్వకుండా దూరం వెళ్తున్నారు అంటే మన బిడ్డపై వాళ్ళకున్న ప్రేమ అలాంటిది వాళ్లు పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారేమో అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఎన్ని చెప్పినా దీప అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు అదే విషయాన్ని ఆలోచించడం కంటే దాన్నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి వేరే విషయాలు ఆలోచించు దీప అని అంటాడు కార్తీక్. బాధపడకు నా మీద నమ్మకం పెట్టుకొని అనడంతో ఆ దేవుడు నాకు పాపం దూరం చేస్తాడేమో మన బాధగా ఉంది అనడంతో నీ ఆరోగ్యం బాగా ఉండాలి కదా అని కార్తీక్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎందుకు ఏడుస్తున్నారు అని టెన్షన్ పడుతుంది.
 

 అప్పుడు ఏం లేదు అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య చారుశీల కి ఫోన్ చేసి ఒకచోటి కలుద్దామని చెప్పడంతో సరే అని అంటుంది చారుశీల. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు దీప తిన్న ప్లేట్ కూడా కార్తీక్ తీసేస్తూ ఉండగా ఈ పనులన్నీ మీకెందుకు డాక్టర్ బాబు అని అంటుంది దీప. నాకేమైంది ఆపరేషన్ అయినా కూడా మీరు నాతో ఏ పనులు చేయించడం లేదు నిజం చెప్పు డాక్టర్ బాబు అని అడగడంతో ఏం లేదు వెళ్లి చేయికడుక్కో అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప లేదు మీరు ఏదో  నా దగ్గర దాస్తున్నారు ఆడడంతో కోపంతో కార్తీక్ చేతిలో ఉన్న ప్లేట్లు విసిరేస్తాడు.
 

ఏంటి నీ ప్రాబ్లం మాటకు ముందు మాట తర్వాత నాకు ఏమైంది నాకు ఏమైంది అని అంటున్నావు ఏదైనా ఉంటే నీ దగ్గర నేను ఎందుకు దాస్తాను అని కార్తీక్, దీప మీద సీరియస్ అవుతాడు. ఇప్పుడు దీప నికి ఏమైంది డాక్టర్ బాబు అనడంతో కార్తీక్ కూల్ అయ్యి ఏం కాలేదు నువ్వు ఆలోచించకు అని తిన్న ప్లేట్లు తీసేస్తాడు. ఆ తర్వాత చారుశీల ఫోన్ చేస్తుంది. అవునా ఇప్పుడే వస్తాను అని కార్తీక్ బయలుదేరుతూ ఉండగా దీప నేను కూడా వస్తాను డాక్టర్ బాబు నాకు ఎలాగో ఉంది అని ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీప కి అబద్ధం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొక వైపు సౌందర్య, చారుశీల ఒకచోట కలుస్తారు. అప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ చాటు నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు చెప్పండి మేడమ్ సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!