Guppedantha Manasu: ధరణికి వార్నింగ్ ఇచ్చిన దేవయాని... రిషి, వసుధారల మధ్య విబేధాలు?

First Published Sep 21, 2022, 9:09 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి వసుధారతో,జరిగినది ఏంటి అనేది  నాకు మొత్తం తెలుసు. నువ్వు నాకేం వివరించాల్సిన అవసరం లేదు. నువ్వు గురుదక్షిణ ఇవ్వడం నాకేం నచ్చలేదు, నాకు నీ మీద ప్రేమ తగ్గదు, అలాగని జగతి మేడం మీద ఉన్న నా అభిప్రాయం కూడా తగదు. నేను మళ్లీ చెప్తున్నాను,నువ్వు నన్ను కోపంగా చూసిన, ప్రేమతో చూసిన జగతి మేడం కొడుకు లా మాత్రం చూడొద్దు రిషి గానే చూడు. నువ్వు ఆకాశదీపం వెలిగిస్తూ నిన్ను కోరిన కోరిక, గురుదక్షిణగా మా నాన్నకి ఇచ్చిన మాట ఆ రెండు జరగవు వసుధార. 
 

నువ్వు ఇంటికి వెళ్లి ఆలోచించు, అయినా నువ్వే కరెక్ట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయని చెప్పి అని కార్లో కూర్చుంటాడు. ఆ తర్వాత సీన్ లో ధరణి వంటగదిలో ఉండగా దేవయాని అక్కడికి వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పాలల్లో బెల్లం కలిపి,ఇంటి కోడళ్ళకి లేకపోతే ఇంట్లో అది ముఖ్యమైన వాళ్ళకి ఇంటి నుంచి బైటకు వెళ్తున్నప్పుడు ఇస్తారు. నువ్వు వసుధార కి  ఇస్తున్నావంటే దానికి నేనేం అనుకోవాలి. నా మాటను ఎదురు చెప్తున్నావనే కదా అని అంటుంది.ఇంతలో జగతి అక్కడికి వస్తుంది. రా జగతి సరైన సమయానికి వచ్చావు ఇక్కడ నీకు ఇద్దరు శిష్యులు తయారయ్యారు.
 

 కాలేజ్ లో ఒకరు, ఇంట్లో ఒకలు. ఇది నా ఇల్లు నేను ఎవర్ని రమ్మంటే వాళ్ళు రావాలి,ఎవరు ఉండాలి అనుకుంటే అల్లే ఉండాలి. చెప్పడానికి మీకు ఏ అర్హత లేదు అని కోపంగా తిడుతుంది.ఈరోజు నుంచి ఇంట్లో ఎవరు ఉండాలో లేదో నేనే చెప్పాలి. ముందు నీ స్థానం ఏంటో ఇంట్లో ఆలోచించుకో ధరణి, తోటి కోడలు ఎలాగ నాకు విలువ ఇవ్వదు. నువ్వు కూడా ఈ మధ్య విలువట్లేదు జాగ్రత్త అని తిడుతుంది.దేవయాని వెళ్ళిపోయిన తర్వాత, అక్కయ్య గురించి తెలిసిందే కదా  మనసుకు తీసుకోకు అని అంటుంది జగతి.ఆ తర్వాత సీన్లో ఇల్లు వచ్చిందని ఇద్దరు దిగుతారు. వసుకి సీట్ బెల్ట్ తీయడం రాకపోతే రిషి వచ్చి సీట్ బెల్ట్ తీస్తాడు. 
 

అప్పుడు వసు సాయంత్రం రెస్టారెంట్ కి వస్తారు కదా సార్ అని అడగగా, ఇప్పుడు విషయం అది కాదు వసుధార. నేను ఇంత సైలెంట్ గా ఉన్నాను అంటే జరిగిన సంఘటనలు ఒప్పుకున్నట్టు కాదు.కొన్ని విషయాల్లో నన్ను ప్రభావితం చేయొద్దు. నా ఆలోచనలను మార్పించడానికి ప్రయత్నించదు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు అని అంటాడు. అప్పుడు వసూ, మనసులో, జగతి మేడం విషయం గురించి అని అనుకుంటుంది.అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.ఆ తర్వాత సీన్లో జగతి మహీంద్రాలు జరిగిన సంఘటన అంతా గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు.
 

  అప్పుడు మహీంద్రా,రిషి ఇంకా రాలేదు.ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటాడు.అప్పుడు జగతి మహీంద్రా తో, నువ్వు ఎంత మంచి వాడివి మహేంద్ర .రిషి నీది స్వార్థమైన ప్రేమ అన్నా సరే రిషి మీద ఏమాత్రం కూడా కోపం రాలేదు అని అంటుంది. అప్పుడు మహీంద్రా, ఎందుకో తెలియదు  రిషి అంటే నాకు ప్రాణం.నా శరీరంలో ఒక భాగమైపోయాడు.వాడి మీద నాకెందుకు కోపం వస్తుంది అని అంటాడు.నీకెందుకు కోపం ఉంటుంది మహేంద్ర నీ సొంత కొడుకు కదా అని అనగా, నీ కొడుకు కూడా జగతి.ఏమో ఏదో ఒక రోజు రిషి కూడా నిన్ను అమ్మా అని పిలిచే రోజు వస్తుందేమో!.
 

 నేను నిన్ను కలుస్తానని జీవితంలో అనుకోలేదు. నువ్వు మన ఇంటికి వస్తావని కూడా అనుకోలేదు అలాగే ఇది కూడా జరగవచ్చు అని అనగా, నాకు అంత పెద్ద అసలు లేవు మహేంద్ర ఇప్పటికే జరిగింది చాలు ఈ విషయం వల్ల రిషి కి వసు కి బేధాలు వస్తాయేమో అని భయపడుతున్నాను అని అనగా, రిషి గురించి నాకు తెలుసు ఇలాంటి విషయాల వల్ల రిషి ప్రేమ మీద ప్రభావం ఏమీ పడదు అని అనుకుంటారు. అప్పుడు జగతి, కానీ నాకు ఒకటే భయం మహేంద్ర ఈ సందర్భం నీ దేవయాని అక్కయ్య ఎలా వాడుకుంటారు అని భయం వేస్తుంది అని అంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం జగతి అని అంటాడు మహేంద్ర. ఇంతలో రిషి ఏడి అని అనుకుంటాడు.
 

అదే సమయంలో రిషి కార్ దిగి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధారకు తను చేసే ప్రయత్నం తప్పని తెలియడం లేదా?అనుకుంటాడు.అదే సమయంలో వసుధార కూడా తన గదిలో రిషి ఫోటో చూసుకొని,నేను చేసిన పని తప్పని ఎందుకు అంటున్నారు అని అనుకుంటుంది. అయినా గురుదక్షిణ ఒప్పందం ఎలా ఒప్పుకుంటుంది అని రిషి అనుకుంటాడు. అదే సమయంలో వసు, నేను అంతకన్నా మంచి గురుదక్షిణ ఎలా ఇవ్వగలను అని అనుకుంటుంది. మరోవైపు రిషి ,అయినా ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి బాధ వారిది. నా బాధ నాకు తెలుసు నేను జగతి మేడంని అమ్మ అని పిలవడం అసంభవం అని అంటాడు.
 

మీ చేత ఎలాగైనా పిలిపిస్తాను సార్, ఎప్పటికైనా తల్లి ప్రేమ విలువ మీకు తెలుస్తుంది అని అంటుంది వసు. ఆ తర్వాత సీన్లో మహేంద్ర సోఫా మీద కూర్చుని బాధగా ఉంటాడు. ఇంతలో గౌతమ్ వచ్చి రిషి మీకు ఫోన్ చేశాడు అంకుల్ అని అడుగుతాడు.లేదు అని మహేంద్ర అనగా, ఎందుకు అంకుల్ అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు గౌతమ్. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. నీ గురించే మాట్లాడుకుంటున్నాము రా అని గౌతమ్ రిషి తో అనగా,  మహీంద్రా, రిషి నా మీద కోపంగా ఉన్నాడు పలకరించకుండా వెళ్తాడేమో అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!