అప్పుడు రిషి అతనితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంతలోనే అక్కడికి జగతి రావడంతో మేడం డాడీ నాకు దూరవడం చాలా బాధను కలిగించింది మేడం అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. డాడీ ఎప్పుడు నాతోనే ఉండాలి మన ఇంట్లోనే ఉండాలి మేడం ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి అని అడగడంతో జగతి సరే అని అంటుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ వచ్చి రిషి తో సెల్ఫీ దిగుతూ ఉండగా జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జగతి మహేంద్ర వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు జగతి, మహేంద్ర మనం వెళ్లాల్సిందేనా అని అనడంతో తప్పదు వెళ్లాలి అని అంటాడు మహేంద్ర.