ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu) మినిస్టర్ గారి వర్క్ ను పూర్తి చేస్తుంది. ఆ తరువాత వసు, జగతి కి కాల్ చేసి మేడం కంప్లీట్ అయింది ఒకసారి చెక్ చేసి చెప్తారా అని అడుగగా, అప్పుడు జగతి(jagathi) ఆ వర్క్ నేను కాదు మీ రిషి సార్ చూసి చెప్పాలి అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో జగతి దగ్గరికి మహేంద్ర, గౌతమ్ వస్తారు. అప్పుడు మహీంద్రా నీ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదా అని అనగా ఇప్పుడే వసుధార పూర్తి చేసి నాకు పంపించింది అని అంటుంది.