ఈరోజు ఎపిసోడ్ లో వసుధార జగతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఫణీంద్ర వచ్చి గేటు దగ్గర ఫ్లెక్సీ చాలా మహేంద్ర అనగా అన్ని పూర్తయ్యాయి అన్నయ్య అని అంటాడు మహేంద్ర. రిషి అక్కడికి రావడంతో రిషి జయచంద్ర గారికి ఫోన్ చేసావా అని అడగగా చేశాను మేడం ఇంకొద్ది సేపట్లో వస్తారు. ఇప్పుడు అకామిడేషనే సమస్యగా మారింది అని అంటాడు. ఆయన హోటల్ గదిలో ఉండరట అని అంటాడు రిషి. మన కాలేజీ గెస్ట్ హౌస్ లో విడిది ఏర్పాటు చేద్దాము అనగా ఆయనకు నచ్చితే ఓకే డాడ్ నచ్చకపోతే ఎలా అని అంటాడు రిషి.