అప్పుడు వసుధార తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఆ చపాతీలకు రిషి సార్ పేరు పెడతాను. ప్రిన్స్ చపాతి,జెంటిల్మెన్ చపాతి అని పేర్లు పెడతాను అని మేడం అని వెనక్కి తిరిగి చూడగా రిషి ఉండడంతో అది చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. అప్పుడు రిషి ఏంటి వసుధార ఇది రిషి చపాతి జెంటిల్మెన్ చపాతి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు సర్ మీకు చపాతి ఎలా కావాలి అని అడగడంతో చపాతి చపాతి లాగా ఉంటే చాలు వసుధార అని అంటాడు. ఇప్పుడు రిషి వసుధర కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దు అని అంటాడు.